నోకియాలో ఆల్కాటెల్-లూసెంట్ విలీనం | Nokia buys Alcatel to take on Ericsson in telecom equipment | Sakshi
Sakshi News home page

నోకియాలో ఆల్కాటెల్-లూసెంట్ విలీనం

Published Thu, Apr 16 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

నోకియాలో ఆల్కాటెల్-లూసెంట్ విలీనం

నోకియాలో ఆల్కాటెల్-లూసెంట్ విలీనం

లండన్: నోకియాలో ఫ్రాన్స్‌కు చెందిన ఆల్కాటెల్-లూసెంట్ కంపెనీ విలీనమైంది. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పరికరాలు తయారుచేసే ఆల్కాటెల్ లూసెంట్ కంపెనీని 1,660 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశామని నోకియా పేర్కొంది. ఈ డీల్ వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయని వివరించింది. ఈ విలీనం కారణంగా ఏర్పడే సంస్థను నోకియా కార్పొరేషన్‌గా వ్యవహరిస్తారు. ఈ డీల్‌లో భాగంగా ఒక్కో ఆల్కాటెల్-లూసెంట్ షేర్‌కు  0.55 నోకియా షేర్లు కేటాయిస్తారు.
 
 ఈ నోకియా కార్పొరేషన్‌లో ఆల్కాటెల్ వాటాదారులు వాటా 33.5 శాతంగా, నోకియా వాటాదారుల వాటా 66.5 శాతంగా ఉంటుంది. ఈ నోకియా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ప్రస్తుత నోకియా చైర్మన్ రిస్టో సీలస్‌మా, సీఈఓగా రాజీవ్ సూరి  వ్యవహరిస్తారు. 1999 తర్వాత టెలికాం రంగంలో ఇదే అతి పెద్ద డీల్. ఆ ఏడాది ఆసెండ్ కమ్యూనికేషన్స్‌ను లూసెంట్ టెక్నాలజీస్ సంస్థ 2,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇక 2006లో లూసెంట్‌ను ఆల్కాటెల్ 1,340 కోట్లకు కొనుగోలు చేసింది.
 
 ఈ విలీనంతో...
 మొబైల్ ఫోన్‌ల నెట్‌వర్క్‌కు సంబంధించిన పరికారలందజేసే అతి పెద్ద సంస్థగా నోకియా కార్పొరేషన్ అవతరిస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎరిక్సన్, హువాయ్‌లు ఉంటాయి. ఈ రెండు కంపెనీల విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.14 లక్షలుగా ఉంటుందని అంచనా.   ఈ విలీనం వల్ల 20 కోట్ల యూరోల వడ్డీ వ్యయాలు ఆదా అవుతాయి. 2019 కల్లా 90 కోట్ల యూరోల నిర్వహణ వ్యయాలు ఆదా అవుతాయి.
 

Advertisement
Advertisement