నోకియా లూమియా 925కూ ఈఎంఐ పద్ధతి | Nokia launches EMI scheme for Lumia 925 | Sakshi
Sakshi News home page

నోకియా లూమియా 925కూ ఈఎంఐ పద్ధతి

Published Thu, Sep 12 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

నోకియా లూమియా 925కూ ఈఎంఐ పద్ధతి

నోకియా లూమియా 925కూ ఈఎంఐ పద్ధతి

న్యూఢిల్లీ: లూమియా 925 ఫోన్లను నెలవారీ వాయిదాల్లో కొనుగోలు చేసే అవకాశాన్ని నోకియా ఇండియా కల్పిస్తోంది. రూ.33,499 ధర ఉన్న ఈ ఫోన్‌ను ఎలాంటి వడ్డీ లేకుండా ఆరు నెలవారీ సులభవాయిదాల్లో (ఈఎంఐ) సొంతం చేసుకునే ఈఎంఐ స్కీమ్‌ను నోకియా ఇండియా బుధవారం ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్ కోసం సిటీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ (మార్కెటింగ్) విరళ్ ఓజా తెలిపారు. ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌దారులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ బ్యాంకులన్నింటి ఖాతాదారుల సంఖ్య 1.6 కోట్లుందని, దీంతో ఈ ఆఫర్ అధిక సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుం దని వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement