పారిశ్రామికోత్పత్తి షాక్ | November IIP disappoints, contracts at -2.1% | Sakshi
Sakshi News home page

పారిశ్రామికోత్పత్తి షాక్

Published Sat, Jan 11 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

పారిశ్రామికోత్పత్తి షాక్

పారిశ్రామికోత్పత్తి షాక్

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి 2013 నవంబర్‌లో పూర్తి నిరాశను మిగిల్చింది. వరుసగా రెండవనెల ఉత్పత్తిలో సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేక క్షీణత మరింత దిగజారింది. అంటే అక్టోబర్‌లో ఉత్పత్తి రేటు 1.6 క్షీణత (-) నమోదుకాగా, నవంబర్‌లో పరిస్థితి మరింత క్షీణించి - 2.1కు దిగజారింది. ఇది 6 నెలల కనిష్టం. ప్రధానమైన తయారీ, వినియోగ రంగాల పేలవ పనితీరు ఇందుకు కారణం. 2012 నవంబర్‌లో కూడా ఉత్పత్తి క్షీణత (-1.0)లోనే ఉంది.
 
 ఎనిమిది నెలల్లో: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలలనూ (ఏప్రిల్-నవంబర్) చూస్తే ఉత్పత్తి రేటులో క్షీణత నమోదయ్యింది. 2012 ఇదే కాలంలో స్వల్పంగా 0.9 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2013 ఇదే కాలంలో -0.2% క్షీణతలోకి జారింది.
 
 కీలక రంగాల తీరు: సూచీలో దాదాపు 75% వాటా కలిగిన తయారీ రంగం నవంబర్‌లో భారీగా క్షీణించింది. అక్టోబర్‌లో ఈ క్షీణత 2% కాగా ఇది మరింతగా 3.5%కు దిగజారింది. 2012 ఇదే నెలలో సైతం ఈ రేటు -0.8 క్షీణతలోనే ఉంది.   ఐఐపీలో 14% వాటా కలిగిన మైనింగ్ రంగం క్షీణ బాట వృద్ధికి మళ్లడం హర్షణీయం. ఇది క్షీణత (-)5.5 % నుంచి 1% వృద్ధికి మళ్లింది. విద్యుత్ రంగంలో వృద్ధి సానుకూల రీతిలో 2.4% నుంచి 6.3%కు పెరిగింది.  
 
 వినియోగ వస్తువుల విభాగం వృద్ధి 2012 నవంబర్‌లో -0.3% కాగా, ప్రస్తుతం ఈ రేటు మరింత దిగజారి -8.7%గా ఉంది.  క్యాపిటల్ గూడ్స్ వృద్ధి స్వల్పంగా 0.3%గా నమోదయ్యింది. 2012 నవంబర్‌లో ఇది క్షీణతలో 8.5 శాతంగా ఉంది . ఎనిమిది నెలల కాలంలో చూస్తే క్షీణత తగ్గడం కొంతలోకొంత ఊరట. ఈ కాలంలో ఈ రేటు -11.3 శాతం నుంచి -0.1 శాతానికి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement