చర్మ కేన్సర్‌కు చెక్ పెట్టే ‘సన్‌ఫ్రెండ్’
వాషింగ్టన్: సూర్యరశ్మి ద్వారా మానవ శరీరానికి అవసరమయ్యే విటమిన్ ‘డి’ లభ్యమవుతున్నా.. అతినీలలోహిత కిరణాల వల్ల స్కిన్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి చెక్ పెట్టేలా అమెరికా పరిశోధకులు ఒక రిస్ట్‌బ్యాండ్‌ను సృష్టించారు.‘యూవీఏప్లస్‌బీ సన్‌ఫ్రెండ్’ పేరుతో రూపొందించిన ఈ రిస్ట్‌బ్యాండ్ సూర్యరశ్మి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. సూర్యరశ్మి తీవ్రత పెరిగితే వెంటనే దానిని ధరించిన వ్యక్తిని అప్రమత్తం చేస్తుంది. దీనిని ధరిస్తే సన్‌స్క్రీన్ లోషన్‌తో కూడా పనిలేదట.
ప్రపంచంలో ఈ తరహా పరికరం సన్‌ఫ్రెండే అని దీని సృష్టికర్తలు షాహిద్ అస్లామ్, కరీన్ ఎడ్జెట్ చెపుతున్నారు. శరీరానికి విటమిన్ డి ఎంత కావాలి.. సూర్యర శ్మి తీవ్రత పెరగడం ద్వారా స్కిన్ కేన్సర్‌కు గురయ్యే అవకాశాల గురించి ఏకకాలంలో తెలియజేయడం సన్‌ఫ్రెండ్ ప్రత్యేకత అని చెప్పారు. అయితే దీన్ని ధరించే వ్యక్తి ముందుగా తన స్కిన్ టోన్, సెన్సివిటీని పరికరంలో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ వాట ర్‌ప్రూఫ్ రిస్ట్‌బ్యాండ్‌కు పేటెంట్ కూడా ఉంది. సన్‌ఫ్రెండ్ లో నాసా రూపొందించిన అల్ట్రా వయొలెట్‌సెన్సార్లు, ఎల్‌ఈడీ ఇండికేటర్లను ఏర్పాటు చేశారు. అతి నీలలోహిత కిరణాలు ప్రమాద స్థాయిని దాటితే వెంటనే ఈ ఎల్‌ఈడీ లైట్లు వెలిగి దానిని ధరించిన వ్యక్తిని అప్రమత్తం చేస్తాయి.