wristband
-
ఓ రిస్ట్‌బ్యాండ్ మీ జీవితాన్ని కాపాడుతుంది!
లండన్: జేమ్స్‌బాండ్ సినిమాలోని హీరో క్యారెక్టర్ సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన పరికరాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టిస్తాడు కదా!. సరిగ్గా అలాంటి పరికరమే ఒకటి రూపొందించబడింది. కాకపోతే అది ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కాదు.. ఎవరికి వారు క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోవటానికి. సరికొత్త రిస్ట్‌బ్యాండ్ ఆవిష్కరణ ఇప్పుడు జేమ్స్‌బాండ్ చిత్రంలోని టెక్నాలజీని గుర్తుచేస్తోంది. కింగ్లీ అనే రిస్ట్‌బ్యాండ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అన్ని రిస్ట్బ్యాండ్లలా ఇది కేవలం అలంకరణకే కాకుండా ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఇది కాపాడుతోంది. నీటిలో మునిగినప్పుడు దీనికి గల మీట నొక్కితే చాలు దీనిలో అదృశ్యంగా ఉన్న బెలూన్ ఓపెన్ అయిపోతుంది. అలా నీటిలో మునిగిన వారు పైకి తేలడానికి ఇది తోడ్పడటమే కాకుండా.. వారికి సంబంధించిన వ్యక్తులను సైతం ఇది అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర సుమారు రూ. 7 వేల వరకూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా నీటిలో మునిగిపోవటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ రిస్ట్‌బ్యాండ్ ఉపయుక్తంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. -
చర్మ కేన్సర్‌కు చెక్ పెట్టే ‘సన్‌ఫ్రెండ్’
వాషింగ్టన్: సూర్యరశ్మి ద్వారా మానవ శరీరానికి అవసరమయ్యే విటమిన్ ‘డి’ లభ్యమవుతున్నా.. అతినీలలోహిత కిరణాల వల్ల స్కిన్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి చెక్ పెట్టేలా అమెరికా పరిశోధకులు ఒక రిస్ట్‌బ్యాండ్‌ను సృష్టించారు.‘యూవీఏప్లస్బీ సన్‌ఫ్రెండ్’ పేరుతో రూపొందించిన ఈ రిస్ట్‌బ్యాండ్ సూర్యరశ్మి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. సూర్యరశ్మి తీవ్రత పెరిగితే వెంటనే దానిని ధరించిన వ్యక్తిని అప్రమత్తం చేస్తుంది. దీనిని ధరిస్తే సన్‌స్క్రీన్ లోషన్‌తో కూడా పనిలేదట. ప్రపంచంలో ఈ తరహా పరికరం సన్ఫ్రెండే అని దీని సృష్టికర్తలు షాహిద్ అస్లామ్, కరీన్ ఎడ్జెట్ చెపుతున్నారు. శరీరానికి విటమిన్ డి ఎంత కావాలి.. సూర్యర శ్మి తీవ్రత పెరగడం ద్వారా స్కిన్ కేన్సర్‌కు గురయ్యే అవకాశాల గురించి ఏకకాలంలో తెలియజేయడం సన్‌ఫ్రెండ్ ప్రత్యేకత అని చెప్పారు. అయితే దీన్ని ధరించే వ్యక్తి ముందుగా తన స్కిన్ టోన్, సెన్సివిటీని పరికరంలో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ వాట ర్ప్రూఫ్ రిస్ట్బ్యాండ్కు పేటెంట్ కూడా ఉంది. సన్‌ఫ్రెండ్ లో నాసా రూపొందించిన అల్ట్రా వయొలెట్సెన్సార్లు, ఎల్ఈడీ ఇండికేటర్లను ఏర్పాటు చేశారు. అతి నీలలోహిత కిరణాలు ప్రమాద స్థాయిని దాటితే వెంటనే ఈ ఎల్ఈడీ లైట్లు వెలిగి దానిని ధరించిన వ్యక్తిని అప్రమత్తం చేస్తాయి.