ఒబామా పర్యటన 'అతిపెద్ద పరిణామం' | Obama's India visit a big development, says Pak daily | Sakshi
Sakshi News home page

ఒబామా పర్యటన 'అతిపెద్ద పరిణామం'

Published Sun, Jan 25 2015 2:31 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

ఒబామా పర్యటన 'అతిపెద్ద పరిణామం' - Sakshi

ఒబామా పర్యటన 'అతిపెద్ద పరిణామం'

ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనపై పాకిస్థాన్ మీడియా కూడా అమితాసక్తి కనబరిచింది. ఒబామా భారత పర్యటనను 'అతిపెద్ద పరిణామం'గా పాకిస్థాన్ పత్రికలు వర్ణించాయి. భారత్-అమెరికా సంబంధాల్లో మొదలైన నూతన అధ్యాయంతో తమకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్  పై ఉందని పేర్కొన్నాయి.

భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానుండడం అతిపెద్ద పరిణామమని 'డైలీ టైమ్స్'  పేర్కొంది. అమెరికా వ్యూహాత్మకంగా భారత్, పాకిస్థాన్ లతో సంబంధాలు కొనసాగిస్తోందని వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అతపెద్ద ఆర్థిక మార్కెట్ అయిన భారత్ తమకు ఉపయోగపడుతుందని అమెరికా తలపోస్తోందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement