
అమెరికా అధ్యక్షుడు ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ 50వ వర్థంతి వేడుకలు ఆగస్టు 28న దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఆ సందర్బాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్లోని లింకన్ మెమోరియల్ హాల్లో లూథర్ కింగ్పై ప్రసంగించనున్నట్లు ఒబామా గురువారం వెల్లడించారు. ఆ ప్రదేశం నుంచే కింగ్పై ప్రసంగించాలన్న తన చిరకాల స్వప్నం ఇలా సాకారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఒబామా చెప్పారు.
ఆర్థ శతాబ్దం క్రితం ఇదే రోజు లింకన్ మెమోరియల్ హాల్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ దాదాపు మూడు లక్షల మంది యూఎస్ వాసుల నుద్దేశించి ప్రసంగించారని ఆయన తెలిపారు. దేశంలోని బ్లాక్, అమెరికన్ల మధ్య బంధం మరింత బలపడాలని మార్టిన్ ఆ సభ నుంచే ఆకాంక్షించిన సంగతిని ఒబామా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ వర్థంతిని పురస్కరించుకుని దేశావ్యాప్తంగా ఆగస్టు 21 నుంచి 28 వరకు మతపరమైన సేవలు జరగనున్నాయి.