కెనడా పార్లమెంట్ భవనంలోనే అగంతకుడు!
కెనడా పార్లమెంట్ భవనంలోనే అగంతకుడు!
Published Wed, Oct 22 2014 9:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM
ఒట్టావో: కెనడా పార్లమెంట్ భవన ఆవరణలో భద్రతా సిబ్బందిపై జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు పాల్గొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసు దుస్తుల్లో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన అగంతకులు.. మూడు చోట్ల కాల్పలకు పాల్పడినట్టు సమాచారం.
కాల్పులకు పాల్పడిన అగంతకులు పార్లమెంట్ భవన ఆవరణలోనే ఉన్నట్టు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. అగంతకుల్ని పట్టుకునేందుకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించి పార్లమెంట్ ను చుట్టుముట్టారని కెనడా మీడియా వెల్లడించింది.
Advertisement
Advertisement