Firing Canada parliament
-
కెనడా పార్లమెంట్ భవనంలోనే అగంతకుడు!
ఒట్టావో: కెనడా పార్లమెంట్ భవన ఆవరణలో భద్రతా సిబ్బందిపై జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు పాల్గొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసు దుస్తుల్లో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన అగంతకులు.. మూడు చోట్ల కాల్పలకు పాల్పడినట్టు సమాచారం. కాల్పులకు పాల్పడిన అగంతకులు పార్లమెంట్ భవన ఆవరణలోనే ఉన్నట్టు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. అగంతకుల్ని పట్టుకునేందుకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించి పార్లమెంట్ ను చుట్టుముట్టారని కెనడా మీడియా వెల్లడించింది. -
కెనడా ప్రధాని క్షేమం, పార్లమెంట్ మూసివేత!
కెనడా: ఒట్టావో నగరంలోని పార్లమెంట్ భవనం వద్ద జరిగిన కాల్పుల ఘటన నుంచి కెనడా ప్రధాని స్టీఫెన్ క్షేమంగా బయటపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో దుండగుడు సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలిసింది. అగంతకుడు కాల్పులు జరిపినపుడు పార్లమెంట్ భవనంలోనే ప్రధాని స్టీఫెన్ ఉన్నారు. ఆ తర్వాత ప్రధానిని భద్రతా సిబ్బంది క్షేమంగా బయటకు పంపించినట్టు తెలుస్తోంది. కెనడా యుద్ధ స్మారక స్తూపం వద్ద విధుల్లో ఉన్న సైనికుడిపై దుండుగుడు కాల్పులు జరుపుతూ పరుగెత్తిన అగంతుకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కెనడా పార్లమెంట్ ను మూసివేశారు.