National War Memorial
-
జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ఏపీ గవర్నర్
ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు ఆదివారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన గవర్నర్, జాతి సేవలో ప్రాణాలర్పించిన వీర యోధులను మననం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 26,000 మందికి పైగా భారత సాయుధ దళాల సైనికులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడే క్రమంలో అసువులు బాసి అత్యున్నత త్యాగం చేశారు. వారి త్యాగ నిరతి కి గుర్తుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. స్మారక చిహ్నం పౌరుల్లో ఉన్నతమైన నైతిక విలువలు, త్యాగం, జాతీయ భావాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చోటు చేసుకున్న వివిధ సంఘర్షణలు, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలు, మానవతా సహాయం, విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాల సమయంలో మన సైనికులు చేసిన త్యాగాలకు ఇది సాక్ష్యంగా నిలిచిందని తెలిపారు. స్మారక చిహ్నం లోతైన అనుభవాలకు ప్రతీక కాగా, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. గవర్నర్ హరిచందన్ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం సందర్శన నేపథ్యంలో అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని నమోదు చేశారు. గవర్నర్‌తో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి గౌరవ ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సమకాలీన రాజకీయ అంశాలను చర్చించారు. -
బంగ్లా విముక్తి వీరులకు జోహార్లు: మోదీ
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ విముక్తి కోసం అలుపెరుగని పోరుసల్పిన బంగ్లా ఉద్యమ వీరులను ప్రధాని మోదీ శ్లాఘించారు. 1971లో పాక్‌తో యుద్ధంలో భారత్ గెలవడంతో బంగ్లాదేశ్ ఆవిర్భావం సాధ్యమైంది. ఈ విజయానికి సూచికగా భారత్‌లో ప్రతీ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. ‘ బంగ్లా స్వాతంత్య్ర కోసం పోరాడిన యోధుల త్యాగాలను, పాక్‌పై కదనరంగంలో యుద్ధం చేసిన భారత సైనికులను స్మరించుకుందాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. విజయ్ దివస్‌లో భాగంగా మోదీ గురువారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వీరులకు నివాళులర్పించారు. విజయానికి గుర్తుగా ఏడాదికాలంగా దేశమంతా చుట్టొచ్చిన నాలుగు విజయజ్యోతి(విక్టరీ టార్చ్)లను యుద్ధస్మారక జ్యోతిలో ప్రధాని విలీనం చేశారు. వీరులకు పార్లమెంట్ ఉభయ సభలు ఘన నివాళులర్పించాయి. బంగ్లాతో మైత్రికే తొలి ప్రాధాన్యం: కోవింద్ బంగ్లాదేశ్‌తో మైత్రికే భారత్ తొలి ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. ఢాకాకు వెళ్లిన ఆయన గురువారం బంగ్లాదేశ్ విమోచన స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢాకాలో నేషనల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విక్టరీ పరేడ్ కార్యక్రమంలో బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలతోపాటు కోవింద్ హాజరయ్యారు. విజయోత్సవ వేడుకల్లో భాగంగా భారత్, బంగ్లా వాయుసేనలు సంయుక్తంగా వైమానిక విన్యాసాలు చేసి అబ్బురపరిచాయి. -
మన సైనికుల పరాక్రమం గర్వకారణం
న్యూఢిల్లీ: 1971లో దాయాది దేశం పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు సర్వదా శ్లాఘనీయం, గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన సైనిక దళాల పరాక్రమంతో భారత్‌కు నిర్ణయాత్మక విజయం దక్కిందని గుర్తుచేశారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని వెలిగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ వెల్లడించారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయానికి 49 ఏళ్లు నిండాయి. ఏడాది పాటు జరగనున్న 50వ వార్షికోత్సవాలను మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని స్వయంగా వెలిగించి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. 4 విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్లో భారత్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈసారి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు స్వర్ణ విజయోత్సవాలు జరుగుతాయి. -
గల్వాన్ వీరులకు మరింత గౌరవం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. జవాన్ల త్యాగాన్ని దేశం వేనోళ్ల కొనియాడింది. తాజాగా ఈ అమరవీరులకు మరింత గౌరవం ఇవ్వడం కోసం కేంద్రం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసవులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘నేషనల్ వార్ మెమోరియల్’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది నెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. (చైనా సరిహద్దుల్లో కీలక నిర్మాణాల వేగవంతం) జూన్ 15న లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక నిఘా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ దాడిలో చైనా సైనికులు.. రాళ్లు, మొలలు దిగిన కర్రలు, ఇనుప రాడ్లతో మన సైనికులపై దాడి చేశారు. నాటి ఘటనలో 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు మరణించారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. చైనా వారికి ప్రభుత్వ లంఛనాలతో అంత్యక్రియలు కాదు కదా కనీసం అమరులైనా సైనికుల పేర్లు కూడా వెల్లడించలేదు. కానీ భారత్ మాత్రం మన సైనికుల త్యాగాన్ని గర్వంగా వెల్లడించింది. -
ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ ప్రారంభం
-
ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రారంభించిన ప్రధాని
-
కెనడా పార్లమెంట్ ఘటనలో ఇద్దరు మృతి!
ఒట్టావో: కెనడా పార్లమెంట్ భవనం వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద కాపలా కాస్తున్న సైనికులపై అగంతకుడు కాల్పులు జరిపాడు. అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు మరణించాడు. దుండగులను ఎదుర్కొనేందుకు సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. వార్ మెమోరియల్, పార్లమెంట్ సెంట్రల్ బ్లాక్, రిడ్యూ సెంటర్ వద్ద అగంతకులు కాల్పులకు పాల్పడినట్టు భధ్రతాధికారులు తెలిపారు. -
కెనడా పార్లమెంట్ భవనంలోనే అగంతకుడు!
ఒట్టావో: కెనడా పార్లమెంట్ భవన ఆవరణలో భద్రతా సిబ్బందిపై జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు పాల్గొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసు దుస్తుల్లో పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన అగంతకులు.. మూడు చోట్ల కాల్పలకు పాల్పడినట్టు సమాచారం. కాల్పులకు పాల్పడిన అగంతకులు పార్లమెంట్ భవన ఆవరణలోనే ఉన్నట్టు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. అగంతకుల్ని పట్టుకునేందుకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించి పార్లమెంట్ ను చుట్టుముట్టారని కెనడా మీడియా వెల్లడించింది. -
కెనడా ప్రధాని క్షేమం, పార్లమెంట్ మూసివేత!
కెనడా: ఒట్టావో నగరంలోని పార్లమెంట్ భవనం వద్ద జరిగిన కాల్పుల ఘటన నుంచి కెనడా ప్రధాని స్టీఫెన్ క్షేమంగా బయటపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో దుండగుడు సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలిసింది. అగంతకుడు కాల్పులు జరిపినపుడు పార్లమెంట్ భవనంలోనే ప్రధాని స్టీఫెన్ ఉన్నారు. ఆ తర్వాత ప్రధానిని భద్రతా సిబ్బంది క్షేమంగా బయటకు పంపించినట్టు తెలుస్తోంది. కెనడా యుద్ధ స్మారక స్తూపం వద్ద విధుల్లో ఉన్న సైనికుడిపై దుండుగుడు కాల్పులు జరుపుతూ పరుగెత్తిన అగంతుకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కెనడా పార్లమెంట్ ను మూసివేశారు.