కెనడా పార్లమెంట్ ఘటనలో ఇద్దరు మృతి!
కెనడా పార్లమెంట్ ఘటనలో ఇద్దరు మృతి!
Published Wed, Oct 22 2014 11:21 PM | Last Updated on Tue, Aug 27 2019 4:33 PM
ఒట్టావో: కెనడా పార్లమెంట్ భవనం వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద కాపలా కాస్తున్న సైనికులపై అగంతకుడు కాల్పులు జరిపాడు. అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు మరణించాడు.
దుండగులను ఎదుర్కొనేందుకు సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. వార్ మెమోరియల్, పార్లమెంట్ సెంట్రల్ బ్లాక్, రిడ్యూ సెంటర్ వద్ద అగంతకులు కాల్పులకు పాల్పడినట్టు భధ్రతాధికారులు తెలిపారు.
Advertisement
Advertisement