తనను పొడిచిన కత్తి తీసి.. దాంతోనే చంపేశాడు! | One killed, disputes between friends at old city | Sakshi
Sakshi News home page

తనను పొడిచిన కత్తి తీసి.. దాంతోనే చంపేశాడు!

Published Sat, Oct 3 2015 7:11 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

తనను పొడిచిన కత్తి తీసి.. దాంతోనే చంపేశాడు!

తనను పొడిచిన కత్తి తీసి.. దాంతోనే చంపేశాడు!

హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఎప్పుడూ వినని కొత్తరకం క్రైమ్ ఒకటి హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. తనను పొడిచిన కత్తి బయటకు తీసి, దాంతోనే అవతలి వ్యక్తిని పొడిచి చంపేశాడో వ్యక్తి!! పాతబస్తీలో గుర్రపు బగ్గీ విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్నేహితుల మధ్య ఘర్షణ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఇబ్రహీం అనే వ్యక్తిని అతడి స్నేహితుడు అలీఅఫారీ బాలాపూర్ పిలిపించి.. అక్కడ కత్తితో పొడిచినట్టు తెలిసింది. అదే సమయంలో ఎదురుదాడికి దిగిన ఇబ్రహీం.. అదే కత్తిని బయటకు తీసి, దాంతోనే అలీఅఫారీని పొడిచినట్టు పోలీసులు తెలిపారు. దాంతో అలీ అఫారీని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

అడ్డొచ్చిన మరో స్నేహితుడు సాదిక్నూ కూడా ఇబ్రహీం పొడిచాడు. దాంతో సాదిక్కు తీవ్రగాయాలు అయినట్టు చెప్పారు. టాంగా (గుర్రపు బగ్గీ) అమ్మకంలో వచ్చిన డబ్బుల వివాదమే ఈ గొడవకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement