మా పరువు పోయింది: యాక్సిస్ బ్యాంకు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు బ్రాంచిల్లోని నకిలీ ఖాతాల్లో వచ్చిపడిన డబ్బు కారణంగా తమ పరువు నట్టేట్లో కలిసిపోయిందని యాక్సిస్ బ్యాంకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరైన రాజీవ్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు పేరు ఇంతగా పాడైపోవడం తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని చెప్పారు. బ్రాండ్ నేమ్ పడిపోయినప్పుడు కృషితో మాత్రమే దాన్ని తిరిగి పొందగలుగుతామని అన్నారు.
గత కొద్ది రోజులుగా కొన్ని యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లోని నకిలీ అకౌంట్లలో ఉన్న డబ్బును ఐటీ శాఖ అధికారులు వెలికితీస్తున్న విషయం తెలిసిందే. దీంతో యాక్సిస్ బ్యాంకు గుర్తింపు రద్దు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. కాగా, ఈ వార్తలను ఆర్బీఐ, యాక్సిస్ బ్యాంకులు కొట్టిపారేశాయి.