బ్రిటన్ లో1,400 పైగా 'స్వలింగ' వివాహాలు! | Over 1,400 same sex marriages registered in Britain | Sakshi
Sakshi News home page

బ్రిటన్ లో1,400 పైగా 'స్వలింగ' వివాహాలు!

Published Thu, Aug 21 2014 5:24 PM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

బ్రిటన్ లో1,400 పైగా 'స్వలింగ' వివాహాలు!

బ్రిటన్ లో1,400 పైగా 'స్వలింగ' వివాహాలు!

లండన్: ఈ మధ్య కాలంలో బ్రిటన్ లో స్వలింగ సంపర్క (సేమ్ సెక్స్) జంటలు పెళ్లిళ్లతో ఒక్కటవుతున్నాయి. గత మార్చి నుంచి జూన్ వరకూ 1,400  స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు జరిగినట్లు ఆ దేశ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాల చట్టం  ఆమోద ముద్ర పొందిన నాటి నుంచి అవి క్రమేపీ పెరుగుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఇంగ్లండ్ , వేల్స్ లో స్వలింగ సంపర్కుల జంటలు అత్యధికంగా పెళ్లిళ్లు చేసుకుంటూ వాటిని నమోదు చేసుకుంటున్నట్లు ఆ నివేదికలో స్పష్టమైంది.

 

ఇందులో  44 శాతం మంది పురుషులుండగా, 56 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో 95 మంది స్వలింగ సంపర్కుల జంటలు ఒక్కటవ్వగా, ఏప్రిల్ లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగి 351కు చేరింది.  మే నెలలో 465, జూన్ లో 498 మంది ఈ వివాహానికి మగ్గు చూపినట్లు స్పష్టమైంది. ఈ పెళ్లిలో చేసుకున్న మహిళలు సగటు వయసు 37 సంవత్సరాలు ఉండగా, పురుషల సగటు వయసు 38 సంవత్సరాలుగా తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement