కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పీ కే సిన్హా నియామకం | P.K. Sinha appointed cabinet secretary | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పీ కే సిన్హా నియామకం

Published Fri, May 29 2015 3:22 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

P.K. Sinha appointed cabinet secretary

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం పీకే సిన్హా నియామాకాన్ని ఖరారు చేస్తూ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పీకే సిన్హా నియామాకానికి అంగీకారం తెలిపారు. వచ్చే నెల 13 వ తేదీ నుంచి సిన్హా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ అజిత్ సేథ్ పదవీ కాలం ముగియనుండటంతో నూతన కేబినెట్ కార్యదర్శి నియామకం అనివార్యమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement