ఏడేళ్ల గరిష్టానికి పీ-నోట్ల పెట్టుబడులు | P-Notes investments reaches seven year high | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల గరిష్టానికి పీ-నోట్ల పెట్టుబడులు

Published Tue, Mar 24 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

ఏడేళ్ల గరిష్టానికి పీ-నోట్ల పెట్టుబడులు

ఏడేళ్ల గరిష్టానికి పీ-నోట్ల పెట్టుబడులు

గత నెలలో రూ.2.71 లక్షల కోట్లు
 
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో పీ-నోట్లు(పార్టిసిపేటరీ నోట్స్) ద్వారా పెట్టుబడులు గతనెలలో ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. 2014 ఫిబ్రవరిలో రూ.2,68,033 కోట్లుగా ఉన్న పీ-నోట్ల పెట్టుబడులు(ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్‌ల్లో) ఈ ఏడాది ఇదే నెలలో రూ.2,71,752 కోట్లకు పెరిగాయని సెబీ పేర్కొంది. 2008, ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అతి పెద్ద పెట్టుబడి. ఆ నెలలో ఈ పెట్టుబడులు రూ.3.23 లక్షల కోట్లుగా ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో 11.2 శాతంగా ఉన్న పీ నోట్ల ద్వారా ఎఫ్‌ఐఐల ఇన్వెస్ట్‌మెంట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో 11.1 శాతానికి తగ్గిపోయాయి. గతంలో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల్లో సగం పీ-నోట్ల పెట్టుబడులే ఉండేవి. పీ-నోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నియమనిబంధనలను సెబీ కఠినతరం చేయడంతో ఎఫ్‌ఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పీ-నోట్ల వాటా తగ్గుతూ వస్తోంది. 2008లో 25-40 శాతంగా ఉన్న ఎఫ్‌ఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పీ-నోట్ల పెట్టుబడుల వాటా 2009 నుంచి 15-20 శాతం రేంజ్‌లో ఉంటోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement