P-notes
-
ఆరేళ్ల గరిష్టానికి పీ–నోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ క్యాపిటల్ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్లు) రూపంలో పెట్టుబడులు ఆరేళ్ల గరిష్టానికి చేరాయి. సెపె్టంబర్ చివరికి ఇవి రూ.1.33 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా ఏడో నెలలోనూ వృద్ధి చెందాయి. 2017 జూలై తర్వాత పీనోట్ పెట్టుబడులు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. నాడు ఇవి రూ.1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెబీ గణాంకాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. సెబీ వద్ద నమోదు చేసుకోకపోయినా, పీ నోట్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల భారత క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీ–నోట్లను సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) జారీ చేస్తారు. పీ–నోట్ల ద్వారా ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో చేసిన పెట్టుబడులు సెప్టెంబర్ ఆఖరుకి రూ.1,33,284 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.1.22 లక్షల కోట్లు ఈక్విటీల్లో ఉండగా, డెట్‌లో రూ.10,688 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో రూ.389 కోట్ల చొప్పున ఉన్నాయి. జూలై చివరికి ఇవి రూ.1.23 లక్షల కోట్లు, జూన్ చివరికి రూ.1.13 లక్షల కోట్లు, మే చివరికి రూ.1.04 లక్షల కోట్లు, ఏప్రిల్ చివరికి రూ.95,911 కోట్ల చొప్పున ఉన్నాయి. పీ నోట్ పెట్టుబడులు సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల సరళినే అనుసరిస్తుంటాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుండడం పీ–నోట్ పెట్టుబడుల్లో వృద్ధికి దారితీస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా సెబీ వద్ద నమోదు చేసుకోకుండా ఇన్వెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉండడం కూడా సానుకూలిస్తున్నట్టు చెబుతున్నారు. రానున్న సంవత్సరాల్లోనూ పీనోట్ పెట్టుబడుల రాక కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేస్తున్నారు. -
రూ. 1.23 లక్షల కోట్లకు పీ–నోట్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్స్) ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులు వరుసగా అయిదో నెలా పెరిగాయి. జులై ఆఖరు నాటికి రూ. 1.23 లక్షల కోట్లకు చేరాయి. తద్వారా ఆరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. 2017 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అప్పట్లో పీ–నోట్స్ ద్వారా పెట్టుబడులు రూ. 1.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ డేటా ప్రకారం జూన్ ఆఖరు నాటికి పీ–నోట్స్ పెట్టుబడులు రూ. 1,13,291 కోట్లుగా ఉండగా జూలై ఆఖరు నాటికి రూ. 1,22,805 కోట్లకు చేరాయి. ఇందులో రూ. 1.13 లక్షల కోట్లు ఈక్విటీల్లో, రూ. 9,531 కోట్ల మొత్తం డెట్ సాధనాల్లో, రూ. 299 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీస్లోను ఉన్నాయి. భారత్‌లో నేరుగా నమోదు చేసుకోకుండా ఇక్కడి స్టాక్ మార్కె ట్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీ–నోట్స్ ఉపయోగపడతాయి. రిజిస్టర్ చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సంస్థలు (ఎఫ్‌పీఐ) వీటిని జారీ చేస్తాయి. సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల ధోరణులకు అనుగుణంగా పీ–నోట్స్ వృద్ధి మారుతుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతీయ ఎకానమీ స్థిరంగా ఉండటమనేది పీ–నోట్స్ పెట్టుబడులు పెరుగుదలకు ఒకానొక కారణమని మార్కెట్ వర్గాలు తెలి పాయి. అలాగే, చైనా ఎకానమీ మందగించడం వల్ల కూడా ఇన్వెస్టర్లు భారత్ వైపు చూస్తున్నారని వివరించాయి. -
రూ. 88 వేల కోట్లకు పీ-నోట్స్ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్ల వేల్యుయేషన్లు గరిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్న నేపథ్యంలో పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) రూపంలో వచ్చే పెట్టుబడుల విలువ ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లకు పరిమితమైంది. జనవరిలో ఇవి రూ. 91,469 కోట్లుగా నవెదయ్యాయి. పీ-నోట్ల పెట్టుబడులు తగ్గడం ఇది వరుసగా మూడో నెల. నేరుగా రిజిస్టర్ చేసుకోకుండా భారత వర్కెట్లలో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పీ-నోట్స్ ద్వారా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్లో పీ-నోట్ల పెట్టుబడుల విలువ ర. 96,292 కోట్లుగా, నవంబర్‌లో ర. 99,335 కోట్లుగా, అక్టోబర్‌లో రూ. 97,784 కోట్లుగాను ఉన్నాయి. ఇతర వర్ధవన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ ఖరీదైనదిగా ఉంటోందని ఎఫ్‌పీఐలు భావిస్తున్నారని నిపుణులు తెలిపారు. భారత్‌లో లాభాలు బుక్ చేసుకుని, ఇతరత్రా చౌక మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయ్యాలనే ఆచనతో వారు ఉన్నట్లు వివరించారు. పీ-నోట్ల రపంలో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన పెట్టుబడుల్లో ర. 78,427 కోట్లు ఈక్విటీల్లోనూ, రూ. 9,851 కోట్లు డెట్‌లోన, రూ. 119 కోట్లు హైబ్రిడ్ సెక్యరిటీల్లోను ఉన్నాయి. -
గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు,ఈ ఏడాదిలో హైయస్ట్
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల ద్వారా (పీ నోట్స్) పెట్టుబడులు అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఇవి గరిష్ట స్థాయి పెట్టుబడులు కావడం గమనించాలి. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్స్‌ను జారీ చేస్తుంటారు. ఈ నోట్స్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. (డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే!) సెబీ వద్ద ఉన్న డేటా ప్రకారం.. సెప్టెంబర్ చివరికి పీనోట్స్ పెట్టుబడులు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో కలిపి రూ.88,813 కోట్లుగా ఉంటే, అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. సాధారణంగా ఎఫ్‌పీఐ పెట్టుబడుల ధోరణిని పీ నోట్ల పెట్టుబడులు అనుసరిస్తుంటాయి. అక్టోబర్ నాటికి వచ్చిన పీనోట్ల మొత్తం పెట్టుబడుల్లో రూ.88,490 కోట్లు ఈక్విటీల్లో, రూ.9,105 కోట్లు డెట్‌లో, రూ.190 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి వచ్చాయి. ‘‘ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ అనే విషయంలో అంతటా ఏకాభిప్రాయం ఉంది. (శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. రూపాయి స్థిరంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
రెండేళ్ల కనిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పీనోట్ల పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. జులైకల్లా వీటి విలువ రూ. 75,725 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూన్ చివరికల్లా రూ. 80,092 కోట్లకు చేరిన పీనోట్ పెట్టుబడులు 20 నెలల కనిష్టానికి చేరాయి. తదుపరి జులైకల్లా రూ. 75,725 కోట్లకు వెనకడుగు వేశాయి. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడులు క్షీణించాయి. ఇంతక్రితం 2020 అక్టోబర్‌లో మాత్రమే వీటి విలువ ఈ స్థాయిలో అంటే రూ. 78,686 కోట్లను తాకాయి. (కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు) పీనోట్ జారీ ఇలా పీనోట్లుగా పిలిచే పార్టిసిపేటరీ నోట్లను దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) జారీ చేస్తుంటారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాని విదేశీ సంస్థలు దేశీయంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అయితే ఇందుకు తగిన పరిశీలన ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో జూన్ చివరికల్లా పీనోట్ పెట్టుబడులు రెండేళ్ల కనిష్టానికి చేరాయి. రూ. 75,725 కోట్లకు పరిమితమయ్యాయి. యూఎస్ ఫెడ్ కఠిన పరపతి విధానాల నేపథ్యంలో 10ఏళ్ల బాండ్ల ఈల్డ్స్ బలపడుతున్నాయి. దీంతో ఎఫ్‌పీఐలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు ఆనంద్ రాఠీ షేర్స్, శాంక్టమ్ వెల్త్ తదితర సంస్థల నిపుణులు పేర్కొంటున్నారు. (అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!) ఈక్విటీలే అధికం జూన్‌కల్లా నమోదైన పీనోట్ పెట్టుబడుల్లో రూ. 66,050 కోట్లు ఈక్విటీలకు చేరగా.. రుణ సెక్యూరిటీలకు రూ. 9,592 కోట్లు లభించాయి. ఇక హైబ్రిడ్ సెక్యూరిటీలలో కేవలం రూ. 82 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. జూన్‌కల్లా నమోదైన రూ. 80,092 కోట్లలో ఈక్విటీలకు రూ. 70,644 కోట్లు చేరగా.. డెట్ విభాగంలో రూ. 9,355 కోట్ల పెట్టుబడులు లభించాయి. కాగా.. వరుసగా 9 నెలల అమ్మకాల తదుపరి తిరిగి ఈ జులైలో ఎఫ్‌పీఐలు నికర పెట్టుబడిదారులుగా నిలవడం గమనార్హం! ఈ బాటలో ఆగస్టులోనూ ఈక్విటీలపట్ల అత్యధిక పెట్టుబడులకు మక్కువ చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
జోరుమీదున్న పీనోట్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పి.నోట్స్ రూపంలోని పెట్టుబడులు భారీగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లోని పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) పి.నోట్స్ జారీ చేస్తుంటారు. వీటి సాయంతో విదేశీ ఇన్వెస్టర్లు సెబీ వద్ద నేరుగా నమోదు కాకుండానే భారత మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2018 మార్చిలో పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.1,06,403 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే మొదటిసారి. అక్టోబర్‌లో పి.నోట్స్ రూపంలోని పెట్టుబడులు రూ.5,000కోట్లకు పైగా పెరగడం మొత్తం పెట్టుబడుల విలువ ఇతోధికం అయ్యేందుకు సాయపడినట్టు పీఎంఎస్ సంస్థ ‘పైపర్ సెరికా’ ఫండ్ మేనేజర్ అభయ్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఆసక్తికరంగా ఈక్విటీల్లోని పి.నోట్స్ పెట్టుబడుల విలువ అక్టోబర్‌లో రూ.7,000 కోట్ల మేర పెరగ్గా.. డెట్ పెట్టుబడుల విలువ రూ.2,000 కోట్ల మేర తగ్గింది. అయితే, ఇదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే దీర్ఘకాలిక వడ్డీ రేట్లు కనిష్టాలకు చేరుకోగా, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో 2022లో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచక తప్పదు’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పి.నోట్స్ పెట్టుబడుల విలువ రూ.97,751 కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.97,744 కోట్లుగాను, జూలైలో రూ.85,799 కోట్ల చొప్పున ఉంది. ఎఫ్‌పీఐల నిర్వహణలోని ఆస్తులు అక్టోబర్ చివరికి రూ.53.60 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
స్టాక్ మార్కెట్ లో నల్లధనంపై సుప్రీం దృష్టి!
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్లు) రూపంలో భారత్ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద ఎత్తున నల్లధనం ప్రవహిస్తోందని, దీనిని అరికట్టడానికి చర్యలు అవసరమని పేర్కొంటూ దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, ఆర్బీఐ,సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. స్టాక్ మార్కెట్లలో దాదాపు రూ.25 లక్షల కోట్ల నల్లధనం ఉందని, ఇందులో పీ-నోట్ల లావాదేవీలూ ఉన్నాయని ఆరోపిస్తూ, ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీ-నోట్ల ద్వారా భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్టర్లు, కేసులో తదుపరి ఉత్తర్వు వచ్చేంతవరకూ ఈ మొత్తాలను విత్‌డ్రా చేసుకోకుండా నిషేధించాలని కూడా పిటిషనర్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సీ నాగప్పన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. కాగా పీ-నోట్ల పెట్టుబడులు మే చివరకురూ.2,15,338 కోట్లకు పెరిగింది. -
పీ-నోట్లకు ఫేవరెట్లు ‘ఫండ్’లే!!
– మన మార్కెట్లో 60% పీ-నోట్లు ఎంఎఫ్లవే – టాప్-10 ఎఫ్‌పీఐల ద్వారా 73 శాతం నిధులు.. – కఠిన నిబంధనలపై మార్కెట్లో ప్రకంపనలు... న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో పీ-నోట్ల తేనెతుట్టె మరోసారి కదిలింది. పీ-నోట్ల మార్గంలో నల్లధనం దేశంలోకి వస్తోందని, మనీ లాండరింగ్‌కు అవకాశం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేయడం మార్కెట్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయితే, భారత్‌లో పెట్టుబడులకు పీ-నోట్లను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నవి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలే కావడం గమనార్హం. ఈ రూట్లో వస్తున్న మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంఎఫ్‌ల వాటా 60 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొత్తం పీ-నోట్ పెట్టుబడులు రూ.2.2 లక్షల కోట్లుగా అంచనా. వీటిలో సెబీ వద్ద నమోదైన టాప్-10 విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఏ) ద్వారా వచ్చినవే 73 శాతం ఉన్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఏమిటీ పీ-నోట్లు...? సాధారణంగా భారత మార్కెట్లోకి ప్రత్యక్షంగా వచ్చే విదేశీ పెట్టుబడులకు ప్రధాన ఆధారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ). మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎఫ్‌పీఐలు కచ్చితంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. వీరు ఇలా నేరుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల వీరి నుంచి అనుమతి పత్రాలు తీసుకుని, ఇతర విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైనా వాటి ద్వారా భారత్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. ఈ ఆఫ్‌షోర్ డెరివేటివ్ సాధనాలనే(ఓడీఐ) పార్టిసిపేటరీ నోట్స్ లేదా పీ- నోట్స్‌గా వ్యవహరిస్తున్నారు. సెబీ కొన్ని విభాగాలకు చెందిన ఎఫ్‌పీఐలకు మాత్రమే పీ-నోట్స్ జారీ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, ఈ విధానంలో పెట్టుబడులను కొందరు ఇన్వెస్టర్లు నల్లధనాన్ని తరలించేందుకు, మనీలాండరింగ్ వంటి కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారంటూ... నల్లధనం అంశంపై సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆందోళనలు వ్యక్తం చేసింది. దీంతో సెబీ రంగంలోకి దిగింది. పీ-నోట్ల ద్వారా పెట్టుబడులు చేసే ఇన్వెస్టర్ల పూర్తి వివరాలను(కేవైసీ) వెల్లడించడం, పీ-నోట్ల జారీకి సబంధించి మదింపు ఇతరత్రా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఎఫ్‌పీఐల సంఖ్య 4,311. అయితే, వ్యక్తిగత విదేశీ ఇన్వెస్టర్లకు పీ-నోట్లను జారీ చేయడానికి సెబీ అనుమతించడం లేదు. కాగా, ఇప్పుడు సెబీ నిబంధనల కఠినతరం కారణంగా భారత్‌లో పీ-నోట్ పెట్టుబడులకు సంబంధించి వ్యయాలు పెరిగేం దుకు దారితీస్తుందని.. ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫండ్స్ జోరు... భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసం ఎఫ్‌పీఐల నుంచి పీ-నోట్లను సబ్స్క్రయిబ్ చేసిన సంస్థలు దాదాపు 2,500 వరకూ ఉన్నట్లు అంచనా. వీటిలో సుమారు 1,500 వరకూ (60 శాతం) మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లు సెబీ వెల్లడించింది. ఇంకా 300 వరకూ ఇతర కంపెనీలు, 50 ట్రస్టులు, 100 బ్యాంకులు, 50 సావరీన్ వెల్త్ ఫండ్స్, 200కు పైగా హెడ్జ్ ఫండ్స్, 60 పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో కొన్ని యూనివర్సిటీ ఫండ్స, ఎండోమెంట్ ఫండ్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఉండటం గమనార్హం. సెబీ చెబుతున్న దానిప్రకారం భారత్‌లో నమోదైన వాటిలో 37 ఎఫ్‌పీఐలు మాత్రమే ప్రస్తుతం ఈ పీ-నోట్లను జారీ చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి చివరినాటికి పీ-నోట్ పెట్టుబడులు రూ.2,23,077 కోట్లుగా నమోదయ్యాయి. భారత్‌లో రిజిస్టర్ అయిన మొత్తం ఎఫ్‌పీఐల నిర్వహణలో ఉన్న అస్తుల్లో ఈ మొత్తం విలువ 10% మాత్రమే. కాగా, ప్రస్తుత పెట్టుబడుల్లో 73% టాప్-10 ఎఫ్‌పీఐలు జారీ చేసిన పీ-నోట్ల ద్వారానే వచ్చాయి. ఈ దిగ్గజ ఎఫ్‌పీఐల్లో మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ వాటా 14%, కాప్‌థాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ 12%, గోల్డ్‌మన్ శాక్స్(సింగపూర్) 7%, హెచ్ఎస్బీసీ బ్యాంక్(మారిషస్) 6% ఉన్నాయి. మిగతా వాటిలో మెరిల్ లించ్ క్యాపిటల్ మార్కెట్స్(స్పెయిన్), సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, స్విస్ ఫైనాన్షియల్(మారిషస్), జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్, నేషనల్ అసోసియేషన్(యూఎస్ఏ), సిటీకార్ప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ల వాటా 4-6% ఉంది. కేమన్ ఐలాండ్స్ టాప్... పీ-నోట్ల ద్వారా భారత్‌లో పెట్టుబడి పెడుతున్న సంస్థలు అత్యధికంగా కేమన్ ఐలాండ్స్ కేంద్రంగానే ఉండటం గమనార్హం. ఇప్పుడున్న పెట్టుబడుల్లో 93 శాతం టాప్-10 దేశాల నుంచే వస్తున్నాయి. ఈ జాబితాలో మారిషస్, యూకే, యూఎస్‌ల్లోని సంస్థలు 11 శాతం చొప్పున వాటాలను దక్కించుకున్నాయి. ఇక ఐర్లాండ్, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్, సింగపూర్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థల వాటా 1-6%. -
పీ-నోట్స్ భయాలతో అమ్మకాలు
♦ మరో 98 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ♦ నిఫ్టీ 34 పాయింట్లు డౌన్ ముంబై: విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి మార్కెట్లో పెట్టుబడులకు ఉపయోగించే పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) నిబంధనల్ని మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి కఠినతరం చేసిన నేపథ్యంలో శుక్రవారం అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 98 పాయింట్ల క్షీణతతో 25,302 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 34 పాయింట్ల తగ్గుదలతో 7,750 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెబి వద్ద రిజిష్టరైన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) ద్వారా మార్కెట్లో పెట్టుబడి చేయడానికి ఇతర ఇన్వెస్టర్లు ఈ పీ-నోట్స్‌ను ఉపయోగించుకుంటుంటారు. ఈ క్లయింట్ల వివరాల్ని ఎఫ్ఐఐలు తప్పనిసరిగా తెలియచేయాలని, వారు ఇక్కడి యాంటీ-మనీలాండరింగ్ చట్టానికి కట్టుబడి వుండాలనే తదితర నిబంధనల్ని తాజాగా సెబి విధించింది. ఈ కారణంగా దేశీయ మార్కెట్ నుంచి నిధులు తరలివెళతాయన్న భయాలతో మార్కెట్లో అమ్మకాలు జరిగాయి. డాలరుతో రూపాయి మారకపు విలువ 67.44 స్థాయికి తగ్గడం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ జూన్ నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని విశ్లేషకులు చెప్పారు. లుపిన్ 9 శాతం పతనం... ఫార్మా కంపెనీ లుపిన్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా ఈ షేరు 9 శాతం క్షీణించి రూ. 1,506 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. తగ్గిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహింద్రా, సిప్లాలు వున్నాయి. బీహెచ్ఈఎల్ స్థానంలోకి పవర్‌గ్రిడ్... బీఎస్ఈ సెన్సెక్స్-30 షేర్ల జాబితా నుంచి ప్రభుత్వ రంగ పవర్ ఎక్విప్మెంట్ కంపెనీ బీహెచ్ఈఎల్ను తప్పించి, మరో పీఎస్‌యూ పవర్‌గ్రిడ్‌ను చేరుస్తున్నారు. ఈ మార్పు జూన్ 20 నుంచి అమల్లోకి వస్తుంది. -
పీ-నోట్ల నిబంధనలు మరింత కఠినం
ముంబై: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి పీ-నోట్ల నిబంధనలను కఠినతరం చేసింది. పార్టిసిపేటరీ నోట్ల ద్వారా ప్రయోజనం పొందేవాళ్లు మనీల్యాండరింగ్‌ను నిరోధించే భారత చట్టాలకు బద్దులై ఉండడం తప్పనిసరని పేర్కొంది. ఆష్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ (ఓడీఐ-వీటినే పీ-నోట్లగా వ్యవహరిస్తారు)కు సంబంధించి ఏవైనా సందేహాస్పద లావాదేవీలు ఉంటే, వీటిని జారీ చేసిన సంస్థలు తక్షణం తమకు నివేదించాలని సెబి ఆదేశాలు జారీ చేసింది. నల్లధనం నిరోధం కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సూచనలు ఆధారంగా ఈ నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. పీనోట్ల జారీ, బదిలీ సంబంధిత నియమనిబంధనలనుమరింత పటిష్టం చేసింది. పీ-నోట్లు జారీ చేసిన సంస్థలు వీటిపై కాలానుగుణమైన సమీక్ష నిర్వహించాలని, వీటి బదిలీ వివరాల నెలవారీ నివేదికలను సమర్పించాలని సెబి ఆదేశించింది. భారత్‌లో నేరుగా నమోదు కాకుండా భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే విదేశీ ఇన్వెస్టర్లకు నమోదిత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జారీ చేసే ఇన్స్ట్రుమెంట్లను పీ-నోట్లుగావ్యవహరిస్తారు. రెండు ఇన్విట్స్కు సెబీ ఆమోదం: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్స్) ఏర్పాటు చేయాలన్న రెండు సంస్థల ప్రతిపాదనలకు సెబి ఆమోదం తెలిపింది. ఇన్విట్స్ ఏర్పాటు కోసం 4 దరఖాస్తులు వచ్చాయని, వీటిల్లో రెండిండికి ఆమోదం తెలిపామని సెబి చైర్మన్ యు.కె.సిన్హా చెప్పారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీఎస్-రీట్స్), ఇన్విట్స్‌పై ఏషియా పసిఫిక్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీట్స్ కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని వివరించారు. -
రూ.2.23 లక్షల కోట్లకు పి-నోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్(పి-నోట్స్) ఇన్వెస్ట్మెంట్స్ మార్చినాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరాయి. ఫిబ్రవరిలో ఈ పి-నోట్ల పెట్టుబడులు 18 నెలల కనిష్టానికి పడిపోయాయి. కాగా పి-నోట్ల పెట్టుబడులు పెరగడం 4 నెలల్లో ఇదే తొలిసారి. నవంబర్ నుంచి పి-నోట్ల పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నా యి. విదేశీ హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్, హెడ్జ్ ఫండ్స్, ఇతర విదేశీ సంస్థలు పి. నోట్ల ద్వారా మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల సమయాన్ని, వ్యయాలను ఈ పి-నోట్ల పెట్టుబడులు ఆదా చేస్తాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,17,740 కోట్లుగా ఉన్న భారత క్యాపిటల్ మార్కెట్లో (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్) పి నోట్ల పెట్టుబడులు గత నెలలో రూ.2,23,077 కోట్లకు పెరిగాయి. -
ఏప్రిల్‌లో తగ్గిన పీ నోట్ల ఇన్వెస్ట్మెంట్స్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లలో పీ-నోట్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తగ్గాయి. ఈ ఏడాది మార్చిలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి పెరిగిన పీ-నోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏప్రిల్‌లో రూ.2.68 లక్షల కోట్లకు తగ్గిపోయాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తెలిపింది. సెబీ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో రూ.2,72,078 కోట్లుగా ఉన్న పీ-నోట్ల పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.2,68,168 కోట్లకు తగ్గిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లపై కేంద్రం ప్రతిపాదించిన కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) పై ఆందోళన, అనిశ్చితి కారణంగా భారత్‌లో పెట్టుబడుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని, ఈ కారణంగా పీ- నోట్ల ఇన్వెస్ట్మెంట్లు తగ్గి ఉండొచ్చని నిపుణులంటున్నారు. గతంలో పీ నోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎఫ్ఐఐల వాటా 50% వరకూ ఉండేది. -
ఏడేళ్ల గరిష్టానికి పీ-నోట్ల పెట్టుబడులు
గత నెలలో రూ.2.71 లక్షల కోట్లు న్యూఢిల్లీ: భారత మార్కెట్లో పీ-నోట్లు(పార్టిసిపేటరీ నోట్స్) ద్వారా పెట్టుబడులు గతనెలలో ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. 2014 ఫిబ్రవరిలో రూ.2,68,033 కోట్లుగా ఉన్న పీ-నోట్ల పెట్టుబడులు(ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్ల్లో) ఈ ఏడాది ఇదే నెలలో రూ.2,71,752 కోట్లకు పెరిగాయని సెబీ పేర్కొంది. 2008, ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అతి పెద్ద పెట్టుబడి. ఆ నెలలో ఈ పెట్టుబడులు రూ.3.23 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో 11.2 శాతంగా ఉన్న పీ నోట్ల ద్వారా ఎఫ్ఐఐల ఇన్వెస్ట్మెంట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో 11.1 శాతానికి తగ్గిపోయాయి. గతంలో ఎఫ్ఐఐల పెట్టుబడుల్లో సగం పీ-నోట్ల పెట్టుబడులే ఉండేవి. పీ-నోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నియమనిబంధనలను సెబీ కఠినతరం చేయడంతో ఎఫ్ఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పీ-నోట్ల వాటా తగ్గుతూ వస్తోంది. 2008లో 25-40 శాతంగా ఉన్న ఎఫ్ఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పీ-నోట్ల పెట్టుబడుల వాటా 2009 నుంచి 15-20 శాతం రేంజ్లో ఉంటోంది.