స్టాక్ మార్కెట్ లో నల్లధనంపై సుప్రీం దృష్టి!
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్లు) రూపంలో భారత్ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద ఎత్తున నల్లధనం ప్రవహిస్తోందని, దీనిని అరికట్టడానికి చర్యలు అవసరమని పేర్కొంటూ దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, ఆర్‌బీఐ,సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. స్టాక్ మార్కెట్లలో దాదాపు రూ.25 లక్షల కోట్ల నల్లధనం ఉందని, ఇందులో పీ-నోట్ల లావాదేవీలూ ఉన్నాయని ఆరోపిస్తూ, ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీ-నోట్ల ద్వారా భారత్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్టర్లు, కేసులో తదుపరి ఉత్తర్వు వచ్చేంతవరకూ ఈ మొత్తాలను విత్‌డ్రా చేసుకోకుండా నిషేధించాలని కూడా పిటిషనర్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సీ నాగప్పన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. కాగా పీ-నోట్ల పెట్టుబడులు మే చివరకురూ.2,15,338 కోట్లకు పెరిగింది.