ఏప్రిల్‌లో తగ్గిన పీ నోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ | Investment via P-Notes shrinks | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో తగ్గిన పీ నోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

Published Tue, May 19 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

Investment via P-Notes shrinks

న్యూఢిల్లీ: భారత మార్కెట్లలో  పీ-నోట్ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తగ్గాయి. ఈ ఏడాది మార్చిలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి పెరిగిన పీ-నోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ఏప్రిల్లో రూ.2.68 లక్షల కోట్లకు తగ్గిపోయాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తెలిపింది. సెబీ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో రూ.2,72,078 కోట్లుగా ఉన్న పీ-నోట్ల పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.2,68,168 కోట్లకు తగ్గిపోయాయి.

విదేశీ ఇన్వెస్టర్లపై కేంద్రం ప్రతిపాదించిన కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) పై ఆందోళన,  అనిశ్చితి కారణంగా భారత్‌లో పెట్టుబడుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని, ఈ కారణంగా పీ- నోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గి ఉండొచ్చని నిపుణులంటున్నారు. గతంలో పీ నోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎఫ్‌ఐఐల వాటా 50% వరకూ ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement