రాకెట్ దాడిలో బాలిక మృతి | Palestinians: Young girl killed by rocket | Sakshi
Sakshi News home page

రాకెట్ దాడిలో బాలిక మృతి

Published Wed, Jun 25 2014 9:29 AM | Last Updated on Wed, Aug 1 2018 2:26 PM

పాలస్తీనాలో తీవ్రవాదులు వరుసగా రెండో రోజు కూడా రాకెట్ దాడులకు దిగారు. గాజా స్ట్రిప్ లోని బుధవారం తెల్లవారుజామున తీవ్రవాదులు రాకెట్ దాడులకు పాల్పడ్డారు.

పాలస్తీనాలో తీవ్రవాదులు వరుసగా రెండో రోజు కూడా రాకెట్ దాడులకు దిగారు. గాజా స్ట్రిప్లోని బుధవారం తెల్లవారుజామున తీవ్రవాదులు రాకెట్ దాడులకు పాల్పడ్డారు. ఆ ఘటనలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిందని ఇజ్రాయిలీ మిలటరీ ఉన్నతాధికారి వెల్లడించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. మంగళవారం ఒక్క రోజున ఇజ్రాయిల్లో తీవ్రవాదులు ఐదు రాకెట్ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి గాజా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement