rocket fired
-
రాకెట్ ప్రమాదంలో ‘మ్యాడ్ మైక్’ దుర్మరణం
లాస్ఏంజెలెస్ : భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ ‘మ్యాడ్ మైక్’హ్యూస్.. ఈ నెల 22న ఓ రాకెట్ ప్రమాదంలో మరణించారు. తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్ రాకెట్‌తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. దాదాపు భూమికి 1,500 మీటర్ల ఎత్తుకు వెళ్లాలన్నది తన కోరిక అని చెప్పారు. అక్కడికి వెళ్లి భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా, గుండ్రటి డిస్క్ మాదిరిగా ఉంటుందని నిరూపిస్తానని పేర్కొన్నారు. కానీ కిందకు దిగకుండానే ఆయన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. -
రాకెట్ దాడిలో యువ క్రీడాకారుడి మృతి
డమాస్కస్: సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెబెల్ గ్రూపు జరిపిన రాకెట్ దాడిలో ఓ యువ పుట్‌బాల్ క్రీడాకారుడు మృతిచెందాడు. మరో ఏడుగురు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సిరియా రాజధాని డమాస్కస్ శివారులోని ఓ స్పోర్ట్స్ క్లబ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో జరిగింది. ఈ సంఘటనలో మృతిచెందినది సమీర్ మహ్మద్ మౌస్సూద్ అనే 12 ఏళ్ల బాలుడిగా గుర్తించినట్లు సిరియన్ ఆర్మీస్ పుట్‌బాల్ టీం అధ్యక్షుడు మోహసీన్ అబ్బాస్ తెలిపారు. మౌస్సూద్,సిరియన్ ఆర్మీ పుట్‌బాల్ టీం యూత్ లీగ్‌లో ఆడుతున్నాడని, అల్-ఫేయాహా స్పోర్ట్స్ క్లబ్లో వారు శిక్షణ తీసుకుంటున్నాడని వివరించారు. గాయపడిన క్రీడాకారులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రెబెల్ గ్రూపు ఈ స్పోర్ట్స్ క్లబ్‌పై పలుమార్లు దాడి చేసిందని తెలిపారు. గత మంగళవారం రాజధానిలో రెబెల్ గ్రూపు జరిపిన బాంబుదాడిలో 44 మంది పౌరులు మృతిచెందిన సంగతి తెల్సిందే. -
రాకెట్ దాడిలో బాలిక మృతి
పాలస్తీనాలో తీవ్రవాదులు వరుసగా రెండో రోజు కూడా రాకెట్ దాడులకు దిగారు. గాజా స్ట్రిప్‌లోని బుధవారం తెల్లవారుజామున తీవ్రవాదులు రాకెట్ దాడులకు పాల్పడ్డారు. ఆ ఘటనలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిందని ఇజ్రాయిలీ మిలటరీ ఉన్నతాధికారి వెల్లడించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. మంగళవారం ఒక్క రోజున ఇజ్రాయిల్‌లో తీవ్రవాదులు ఐదు రాకెట్ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి గాజా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని తెలిపారు.