
సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌తో మైఖేల్
లాస్‌ఏంజెలెస్ : భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ ‘మ్యాడ్ మైక్’హ్యూస్.. ఈ నెల 22న ఓ రాకెట్ ప్రమాదంలో మరణించారు. తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్‌ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్ రాకెట్‌తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. దాదాపు భూమికి 1,500 మీటర్ల ఎత్తుకు వెళ్లాలన్నది తన కోరిక అని చెప్పారు. అక్కడికి వెళ్లి భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా, గుండ్రటి డిస్క్ మాదిరిగా ఉంటుందని నిరూపిస్తానని పేర్కొన్నారు. కానీ కిందకు దిగకుండానే ఆయన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment