అసోంలో పతంజలి మెగా ఫుడ్‌పార్క్ | Patanjali Ayurved to invest Rs 1,300 crore in Assam | Sakshi
Sakshi News home page

అసోంలో పతంజలి మెగా ఫుడ్‌పార్క్

Published Tue, Nov 8 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

అసోంలో పతంజలి మెగా ఫుడ్‌పార్క్

అసోంలో పతంజలి మెగా ఫుడ్‌పార్క్

హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ‘పతంజలి ఆయుర్వేద్’... అసోంలో మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా బలిపర ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఈ ఫుడ్ పార్క్‌కు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదివారం శంకుస్థాపన చేశారు. దాదాపు 1,300 కోట్ల పెట్టుబడితో ఈ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఫిబ్రవరి నాటికి ఇందులో కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్‌దేవ్ ఈ సందర్భంగా తెలిపారు. రూ.20,000 కోట్ల వార్షిక టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటవుతున్న ఈ ఫుడ్ పార్క్ దాదాపు 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఆచార్య బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement