పవన్ హన్స్ హెలికాప్టర్ గల్లంతు
న్యూఢిల్లీ: అసోంలోని డిబ్రుగఢ్ నుంచి బయల్దేరిన పవన్ హన్స్ హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. ఈ హెలికాప్టర్లో ఓ సీనియర్ పోలీస్ అధికారితో సహా ముగ్గురు ఉన్నారు. వీరిలో పైలట్, కో పైలట్ ఉన్నట్టు సమాచారం.
మంగళవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్లోని ఖోన్సా జిల్లాకు వెళ్లడానికి హెలికాప్టర్లో బయల్దేరారు. డిబ్రుగఢ్లో టేకాఫ్ తీసుకున్న తర్వాత హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. 11 గంటల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.