పవన్ 'నేను-మనం-జనం'
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 'నేను-మనం-జనం( ట్యాగ్ లైన్ : మార్పు కోసం యుద్ధం)' అనే పుస్తకం రాస్తున్నట్టు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ స్థాపించడం వెనుక ఉద్దేశం, ప్రేరేపించిన పరిస్థితులు, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న కార్యక్రమాలు, సాధించాల్సిన ఆశయాలను ఈ పుస్తకంలో వెల్లడించునున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ పుస్తకం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
కాగా ఇంతకు ముందు ఆయన పార్టీ సిద్ధాంతాల గురించి ‘ఇజమ్’ అనే పుస్తకాన్ని రాశారు. అయితే దానికంటే భిన్నంగా, సరళంగా, సూటిగా ఉండాలనే తాజాగా ఈ పుస్తకం రాస్తున్నారని సన్నిహితులు పేర్కొన్నారు.
