పరామర్శకు వస్తే అడ్డుకుంటారా! | people anger on TDP govt over Penuganchiprolu bus accident | Sakshi
Sakshi News home page

పరామర్శకు వస్తే అడ్డుకుంటారా!

Published Thu, Mar 2 2017 4:54 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

people anger on TDP govt over Penuganchiprolu bus accident

- జగన్‌మోహన్‌రెడ్డి ఎవరినీ బెదిరించలేదు
- ఆయన వస్తున్నారని తెలియగానే హడావుడి చేశారు
- శవాలను త్వరగా తీసుకెళ్లమని అంబులెన్సులు పంపారు
- బస్సు ప్రమాదంలో మరణించిన మృతుల బంధువుల వెల్లడి


గరిడేపల్లి (హుజూర్‌నగర్‌):
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపంలోని ముండ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కావాలనే అడ్డుకుందని మృతుల బంధువులు ఆరోపించారు. ఆయన ఎవరినీ బెదిరించలేదని స్పష్టంచేశారు. మానవత్వంతో పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ను అడ్డుకోవడం బాధాకరమన్నారు.

మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం దివాకర్‌ ట్రావెల్స్‌కు వంతపాడడం దారుణమని మండిపడ్డారు. బస్సు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండరాంపురానికి చెందిన సోదరులు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారమిక్కడ అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించారు. శేఖర్‌రెడ్డి భువనేశ్వర్‌ ఆర్మీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తూ మృతి చెందడంతో ఆర్మీ అధికారులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నేతపై అక్కసు వెళ్లగక్కడం సిగ్గుచేటన్నారు.

మేం కూడా బతకలేం
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదంలో పెళ్లీడుకొచ్చిన  కొడుకులిద్దర్నీ కోల్పోయాను. మేం కూడా ఇక బతకలేం.
– శేషిరెడ్డి, కోదండరాంపురం (శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల తండ్రి)

ప్రభుత్వాలపై హైకోర్టులో రిట్‌ వేస్తా
డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే మా పిల్లలు చనిపోయారు. ప్రతి పక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్‌ వస్తే అడ్డుకోవడం దారు ణం. ఆయన ఎవరినీ బెదిరించ లేదు. ప్రభుత్వాలు స్పందించ కపోతే... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై రిట్‌ వేస్తాను. సాయం చేయాల్సిన ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కన పెట్టి జగన్‌ను అడ్డుకుంది.   
 – ఎన్‌.సత్యనారాయణరెడ్డి, మృతుల పెదనాన్న, అడ్వొకేట్, హైదరాబాద్‌

మంత్రి పట్టించుకోలేదు
చనిపోయిన వారు మా బావమర్దులు. ప్రమాదంలో మర ణిస్తే వారిని పరామర్శిం చాల్సిన మంత్రి కామినేని శ్రీనివాసరావు అక్కడికి వచ్చి పట్టించుకోలేదు. జగన్‌ వస్తున్నారన్న విషయాన్ని తెలు సుకున్న అధికారులు.. చిన్న అంబులెన్స్‌లను పంపించి శవాలను త్వరగా తీసుకెళ్లమని చెప్పారు.
– కట్టా శ్రీనివాస్‌రెడ్డి, నేరేడుచర్ల

కావాలనే బద్నాం చేస్తున్నారు
పోస్టుమార్టం చేసేటప్పుడు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం చారు. డ్రైవర్‌ ఎలా చనిపోయాడో.. ఆల్క హాల్‌ తీసుకున్నాడా.. లేదా..అన్న విష యం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సింది. ఈ విషయంపైనే జగన్‌ అడిగారు. అయినా డాక్టర్లు నోరు విప్పలేదు.  జగన్‌ని  ప్రభుత్వం కావాలని బద్నాం చేస్తోంది.
– తోడేటి బాలకృష్ణ, స్నేహితుడు, గరిడేపల్లి

దివాకర్‌ ట్రావెల్స్‌ను నిషేధించాలి
దివాకర్‌ ట్రావెల్స్‌ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి. కేవలం ఒకే డ్రైవర్‌ను కేటాయించడం వల్ల 11 మంది ప్రాణాలు గాల్లో కలిసా యి. అయినా ఏపీ ప్రభుత్వం దివాకర్‌ ట్రావెల్స్‌పై చర్య తీసుకోకపోవడం బాధాకరం.  జగన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు. జగన్‌ రాకతోనే మాకు న్యాయం జరిగింది.
– వెన్న రవీందర్‌రెడ్డి, కోదండరాంపురం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement