
బంగారం ఇంట్లో దాచుకుందామన్నా...
బంగారం డిపాజిట్ పథకంలో బాండ్ల రూపంలో భద్రత ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసాయిచ్చారు.
న్యూఢిల్లీ: దేశంలో నిరుపయోగం పడివున్న బంగారం నిల్వలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు బంగారం డిపాజిట్ల పథకాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... దేశంలో 20 వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇంత బంగారం ఉన్న భారత్ పేద దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బంగారం నిల్వలను వెలికితీసి డిమాండ్ తగ్గించే చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
బంగారం డిపాజిట్ల పథకాలతో మహిళలు ఆర్థికంగా సాధికారత సాధికారత సాధిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల కారణంగానే ఇలాంటి పథకాలు విజయవంతం అవుతున్నాని అన్నారు. బంగారాన్ని ఇంట్లో దాచుకుందామన్న భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. బంగారం డిపాజిట్ పథకంలో బాండ్ల రూపంలో భద్రత ఉంటుందని భరోసాయిచ్చారు. బాండ్లు దొంగిలించినా పెద్దగా ప్రయోజనం ఉండదని వివరించారు.