సీటుకు రూ.5 వేలు కడితే చాలు | per seat for 5 thousand rupess in Education Council | Sakshi
Sakshi News home page

సీటుకు రూ.5 వేలు కడితే చాలు

Published Thu, Oct 15 2015 3:49 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

per seat for 5 thousand rupess in Education Council

సాక్షి, హైదరాబాద్: ‘సీటుకు రూ.5 వేలు కట్టండి. మీ తప్పులన్నీ మాఫీ చే యించుకోండి’ ఇదీ ప్రైవేటు సాంకేతిక, వృత్తి విద్యాకాలేజీలకు ఉన్నత విద్యామండలి ఇస్తున్న బంపర్ ఆఫర్. కాలేజీల్లో వివిధ కోర్సుల్లో రాష్ట్రేతర విద్యార్థులకు ప్రవేశాలు తదితర అక్రమాలకు పాల్పడి ఉంటే వాటిని సరిచేసుకోవడానికి సీటుకు రూ.5 వేల చొప్పున అపరాధ రుసుముగా చెల్లించాలని ఉన్నత విద్యామండలి సర్క్యులర్ జారీచేసింది. గురువారం ఈ సర్యులర్‌ను మండలి వెబ్‌సైట్లో పొందుపరిచారు.

2014-15లో కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లలో, మేనేజ్‌మెంటు కోటాలోని సీట్ల భర్తీలో నిబంధనలకు విరుద్ధంగా ఆయా కాలేజీలు ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ప్రవేశాలను అధికార యుతం చేసేందుకు ఈ జీవో విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement