
మోదీ పర్యటన ఏడున్నర గంటలు
రాజధాని శంకుస్థాపనలో 1.15 గంటలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా పండుగ రోజు ఏడున్నర గంటలపాటు రాష్ట్రంలో గడపనున్నారు. ఆయన ఈ నెల 22వ తేదీన రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో 1.15 గంటలపాటు పాల్గొంటారు. అనంతరం తిరుపతి విమానాశ్రయంలో గరుడ టెర్మినల్ ప్రారంభోత్సవం చేస్తారు. తరువాత తిరుపతిలోని శ్రీసిటీలో నెలకొల్పనున్న మొబైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు.
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తొలిసారిగా స్వామి వారిని దర్శించుకోనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. మోదీ పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి...
* ఉదయం 9.25 గంటలకు: ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు
* 11.50: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు
* 11.55: గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతికి పయనం
* మధ్యాహ్నం 12.20గంటలకు: అమరావతి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు
* 12.25: అమరావతి హెలిప్యాడ్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరుతారు
* 12.30: రాజధాని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకుంటారు
* 12-30 నుంచి 1.45 వరకు: శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు
* 1.50: శంకుస్థాపన ప్రాంగణం నుంచి రోడ్డుమార్గంలో అమరావతి హెలిప్యాడ్‌కు వెళ్తారు
* 2: అమరావతి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు
* 2.25: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు
* 2.30: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరుతారు (విమానంలోనే భోజనం)
* 3.25: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు
* 3.30 నుంచి 3.45 వరకు: తిరుపతి విమానాశ్రయంలో గరుడ టెర్మినల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు
* 3.50: తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో శ్రీసిటీకి బయల్దేరుతారు
* 3.55 నుంచి 4.15 వరకు: మొబైల్ మ్యానుఫాక్చరింగ్ హబ్ శంకుస్థాపనలో పాల్గొంటారు
* సాయంత్రం 4.20గంటలకు: శ్రీసిటీ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి 5 గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు.
* 5 నుంచి 5.10 వరకు: పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు
* 5.15: పద్మావతి అతిథి గృహం నుంచి బయల్దేరి శ్రీవారి దర్శనానికి వెళ్తారు.
* 6.15: శ్రీవారి దర్శనంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు.
* 6.55: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
* రాత్రి 7గంటలకు: తిరుపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు(రాత్రి భోజనం విమానంలోనే ఏర్పాటు చేశారు)