చండీగఢ్: పంజాబ్ విజయం ఆరంభం మాత్రమేనని, కాంగ్రెస్ ఇక దూసుకెళ్తుందని మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అధికార అకాలీదళ్ గర్వం కారణంగానే ఓడిపోయిందని వ్యాఖ్యనించారు. దుష్టులను ప్రజలు ఓడించారని, ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కొత్త సంవ్సతర కానుక అని వర్ణించారు. పంజాబ్ గెలుపుతో కాంగ్రెస్ కు పునరుత్తేజం వచ్చిందని, ఇక్కడి నుంచే తమ పార్టీ విస్తరిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమృత్ సర్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధూ ముందంజలో ఉన్నారు.