
పుష్కర ‘పాపం’ ప్రభుత్వానిదే
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
పెందుర్తి: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో పెద్ద ఎత్తున భక్తులు మృతిచెందడం తీరని విషాదమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ విచారం వ్యక్తం చేశారు. ఈ పాపం ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పుష్కరాల్లో ప్రచారంకోసం పాకులాడిన ప్రభుత్వం భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని తప్పుపట్టారు.
తొలిరోజు లక్షలాది మంది వస్తారని ముందే తెలిసిన ప్రభుత్వం, అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో అలసత్వం వహించారన్నారు. కుంభమేళాను తలపిస్తామని ప్రచారం చేసినవారు తగిన ఏర్పాట్లు చేయాలి కదా అని ప్రశ్నించారు.