బాగ్దాద్ కారు బాంబు పేలుళ్ల మా పనే: అల్ ఖైదా | Qaida group claims responsibility for Baghdad bombings | Sakshi
Sakshi News home page

బాగ్దాద్ కారు బాంబు పేలుళ్ల మా పనే: అల్ ఖైదా

Published Tue, Oct 1 2013 3:49 PM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

Qaida group claims responsibility for Baghdad bombings

ఇరాక్ రాజధాని బాగ్దాద్లో నిన్న సృష్టించిన కారుబాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా మంగవారం స్ఫష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. నగరంలో మరిన్ని దాడులకు చేసేందుకు సమాయత్తమైనామని, అయితే భద్రతా సిబ్బంది నిరంతర పహారా వల్ల  అది సాధ్యపడలేదని ఆ పేర్కొంది.

 

బాగ్దాద్లోని షీట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 13 కారు బాంబులు పేలాయి. ఆ ఘటనలో  మొత్తం 41 మంది మరణించారు. మరో 151 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement