బాగ్దాద్ కారు బాంబు పేలుళ్ల మా పనే: అల్ ఖైదా
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిన్న సృష్టించిన కారుబాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా మంగవారం స్ఫష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. నగరంలో మరిన్ని దాడులకు చేసేందుకు సమాయత్తమైనామని, అయితే భద్రతా సిబ్బంది నిరంతర పహారా వల్ల అది సాధ్యపడలేదని ఆ పేర్కొంది.
బాగ్దాద్‌లోని షీట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 13 కారు బాంబులు పేలాయి. ఆ ఘటనలో మొత్తం 41 మంది మరణించారు. మరో 151 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.