సోనియా కారుకు డ్రైవర్ ఎవరో తెలుసా?
విదేశాల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తోడుగా.. ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. వాళ్లిద్దరూ ఎక్కడకు వెళ్లారో, ఏ దేశంలో ఉన్నారో తెలియదు గానీ ఇద్దరూ కలిసే తిరుగుతున్న విషయం మాత్రం స్పష్టమైంది. హెల్త్ చెకప్ కోసం వెళ్లిన తన తల్లికి తోడుగా ఉండేందుకు తాను వెళ్లినట్లు రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేశారు. అందులో తన తల్లి ముందు సీట్లో కూర్చుని ఉండగా స్వయంగా రాహులే కారు నడుపుతున్నట్లు ఉంది.
ఆమె వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత దగ్గరుండి సోనియాను భారతదేశానికి తీసుకుని వస్తానని అందులో రాహుల్ చెప్పారు. ఇంతకుముందు కేన్సర్ చికత్స చేయించుకోడానికి సోనియా గాంధీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. బహుశా ఇప్పుడు కూడా అక్కడికే వెళ్లారా అన్న ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోతో పాటు పెట్టిన కేప్షన్‌లో మాత్రం రాహుల్ ఆ విషయాన్ని చెప్పలేదు. అలాగే కచ్చితంగా ఎప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చేదీ కూడా తెలియజేయలేదు.