'విదేశాలకు కాదు మోదీ... పంజాబ్ వెళ్లు' | Rahul Gandhi to Speak in Parliament Today on Farmers' Crisis | Sakshi
Sakshi News home page

'విదేశాలకు కాదు మోదీ... పంజాబ్ వెళ్లు'

Published Wed, Apr 29 2015 12:48 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

'విదేశాలకు కాదు మోదీ... పంజాబ్ వెళ్లు' - Sakshi

'విదేశాలకు కాదు మోదీ... పంజాబ్ వెళ్లు'

న్యూఢిల్లీ: దేశంలో రైతులను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం లోక్సభలో రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కొన్నాళ్లుగా మోదీ దేశంలోనే ఉంటున్నారు... ఈ నేపథ్యంలో పంజాబ్ వెళ్లి రైతుల పరిస్థితిని ఓ సారి పరిశీలించాలని రాహుల్ గాంధీ... ఈ సందర్భంగా మోదీకి సూచించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యాలపై సభలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, హర్సిమ్రత్ కౌర్ మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.... ఆ సమయంలో రాహుల్ గాంధీ ఏ ప్రాంతానికి వెళ్లి రైతులను పరిశీలించారని హర్సిమ్రత్ కౌర్ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement