పిరికిపందల చర్య: రాజ్ నాథ్ సింగ్
న్యూఢిల్లీ: చత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేయడాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. పిరికిపందల చర్యగా దాడిని వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, డీజీపీలతో ఫోన్ మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడి నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఆర్పీఎఫ్ డీజీ ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ హెచ్ ఎస్ సంధూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుకుమా జిల్లా చింతగుపా సమీపంలో సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు జరిపిన దాడిలో 13 మృతి చెందారు.