
అరుదైన జాతి సర్పం గుర్తింపు
వనపర్తి టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట గురుకుల పాఠశాల కాంట్రాక్టు లెక్చరర్ పరమేష్ గురువారం అచ్చంపేటలోని ఉమామహేశ్వర క్షేత్రానికి వెళ్లగా ఆ ప్రాంతంలో అరుదైన పాము కని పించింది. అది కోలుబ్రిడే కుటుంబానికి చెందినదని వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదశివయ్య నిర్థారించారు. ఈ పాము సన్నగా సుమారు 40 సెం.మీ పొడవు ఉంది.