జమ్ము: ఉగ్రవాదులతో భీకరంగా పోరాడి పదిమందిని హతమార్చిన ఆర్మీ కమాండో వీరమరణం పొందారు. భారత సైన్యంలో స్పెషల్ ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్న లాన్స్ నాయక్ మోహన్నాథ్ గోస్వామి.. కశ్మీర్ లోయలో ఉగ్రవాద ఏరివేత కార్యక్రమాల్లో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. 11 రోజుల్లో మూడు ఎన్కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులను చంపి, మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. అయితే విధి నిర్వహణలో భాగంగా కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతూ గోస్వామి ప్రాణాలు కోల్పోయారు.
దేశం కోపం ప్రాణాలు అర్పించిన గోస్వామి 2002లో సైన్యంలో చేరారు. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో పాల్గొన్నారు. ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. ఆయన స్వస్థలం ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా ఇందిరా నగర్ గ్రామం. ఆయనకు భార్య, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. గోస్వామి స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆర్మీ ఆధికారి తెలిపారు.
10 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి..
Published Sat, Sep 5 2015 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement