శ్రీనగర్: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన భారత ఆర్మీకి చెందిన కమాండర్ లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి తన ప్రాణాలు కోల్పోయాడు. పదకొండు రోజుల్లో 10 మంది ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ ప్రత్యేక దళాల కమాండర్ నాయక్ గోస్వామి.. మరికొంతమంది ఉగ్రవాదులన్ని మట్టుబెట్టే యత్నంలో హంద్వారాలో గురువారం తుదిశ్వాస విడిచాడు.
మొత్తం మూడు ఎన్ కౌంటర్లలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చాడు. అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయాడు. భారత రక్షణ దళాలు గోస్వామికి ఘనమైన నివాళులు అర్పించాయి. 2002 లో ఆర్మీలో పెరా కమాండోల విభాగంలో జాయిన్ అయిన గోస్వామి.. ఆ తరువాత ప్రమోషన్ పై ఆర్మీ ప్రత్యేక దళాల కమాండోల విభాగంలోకి మారాడు. గత నెల 23 వ తేదీ నుంచి జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేతలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ లో గోస్వామి చురుగ్గా పాల్గొన్నాడు. పదకొండు రోజుల్లో పది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశ సేవలో ప్రాణాలు కోల్పోయాడు.