సిగరెట్ విక్రయాలపై రష్యా సంచలన నిర్ణయం
సిగరెట్ విక్రయాలపై రష్యా సంచలన నిర్ణయం
Published Thu, Jan 12 2017 12:30 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
సిగరెట్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని రష్యా నిర్ణయించింది. పూర్తిగా రద్దు చేసే నేపథ్యంలో 2015 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు విక్రయాలు చేపట్టకుంటా రద్దు చేస్తున్నట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ ప్రతిపాదనకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం జై కొట్టారు. పొగాకును పూర్తిగా రద్దు చేస్తున్న మొదటి దేశంగా రష్యా చరిత్రలోకి ఎక్కనుంది. రష్యా తీసుకున్న ఈ రద్దు నిర్ణయాన్ని ఆ దేశానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్ట్ చేసింది.
2033 నుంచి ఇది అమల్లోకి రానుంది. 2015లో జన్మించిన రష్యన్ సిటిజన్లు ఆ యేటికి 18 సంవత్సరాల వయసులోకి రానున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించిన లక్ష్యం సిద్ధాంతపరంగా కచ్చితంగా సరియైనదని రష్యా పార్లమెంట్ హెల్త్ కమిటీ సభ్యుడు నికోలాయ్ గెరాసిమెన్కో పేర్కొన్నారు. రద్దుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను వివిధ పెడరల్ ఏజెన్సీలకు పంపామని, ఆర్థిక, ఎకనామిక్ డెవలప్మెంట్ వంటి మంత్రిత్వశాఖలకు పంపిపట్టు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 2016లో రష్యాలో స్మోకర్లు 10 శాతం తగ్గారు.
Advertisement