
శాంసంగ్ 'గెలాక్సీ నోట్ 7' నేడే లాంచ్...ధర 63 వేలా?
మొబైల్ మార్కెట్ లో రారాజుగా ఉన్న శాంసంగ్ సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ నోట్ 7' విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం రాత్రి 8.30 గం.కు న్యూయార్క్, లండన్, రియోడి జనేరియో లో అట్టహాసంగా లాంచ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక లీక్ లు ఉన్నప్పటికీ, ధర వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కానీ రూ. 63,000 లుగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే శామ్సంగ్ గెలాక్సీ 7 మంగళవారం నుంచే దక్షిణ కొరియా మార్కెట్ లో అందుబాటులో రానుందని సమాచారం. లేదంటే రియో ఒలంపిక్స్ ముందే ఆగస్ట్ 5 లోపే రావచ్చని అంచనా. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 19 అమెరికాలో, ఆగస్టులో 16 నుంచి యూరప్ లో అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. అలాగే ఇదే ఈవెంట్ యాపిల్ ఐ క్లౌడ్ కి పోటీకి శాంసంగ్ క్లౌడ్ ను అవిష్కరించే అవకాశం నివేదికలు భావిస్తుననాయి.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫీచర్లు...
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఎస్ పెన్ స్టైలస్
హార్ట్‌రేట్ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, బారోమీటర్
4జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3600 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్