ఆయేషా కేసు: హైకోర్టు సంచలన తీర్పు | satyam babu acquited in ayesha mira murder case | Sakshi
Sakshi News home page

ఆయేషా కేసు: హైకోర్టు సంచలన తీర్పు

Published Fri, Mar 31 2017 1:11 PM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM

ఆయేషా కేసు: హైకోర్టు సంచలన తీర్పు - Sakshi

ఆయేషా కేసు: హైకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసులో ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతడికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తెలిపింది. తగిన ఆధారాలు ఏవీ లేకుండా సత్యంబాబును ఎనిమిదేళ్ల పాటు జైల్లో ఉంచినందుకు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

కాగా ఇంతకుముందు ఈ కేసులో సత్యంబాబుకు విజయవాడ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పట్లో ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా సత్యంబాబు నిర్దోషి అని, అసలు నిందితులైన కోనేరు రంగారావు బంధువులను వదిలిపెట్టి ఇతడిని ఇరికించారని చెప్పారు. ఇప్పుడు ఆమె చెప్పిన విషయాలతో హైకోర్టు కూడా ఏకీభవించినట్లు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement