సౌదీ ప్రిన్స్కు మరణశిక్ష | Saudi Arabia executes prince for murder: Official media | Sakshi
Sakshi News home page

సౌదీ ప్రిన్స్కు మరణశిక్ష

Published Wed, Oct 19 2016 11:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

సౌదీ ప్రిన్స్కు మరణశిక్ష

సౌదీ ప్రిన్స్కు మరణశిక్ష

సౌదీ చరిత్రలోనే తొలిసారి ఓ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారు. టర్కీ బిన్ సౌద్ అల్ కబీర్ అనే సౌదీ యువరాజు తోటి సౌదీని అకారణంగా చంపినందుకు గాను అతనికి రియాద్లో మరణశిక్ష విధించారు. 2012లో తన మిత్రుడైన అదిల్ అల్-మహ్మద్తో ఘర్షణ జరిగిన అనంతరం యువరాజు ఆగ్రహంతో అతణ్ణి కాల్చిచంపాడని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొంది.
 
అయితే ఆ యువరాజుకు మరణశిక్ష ఎలా విధించారో తెలియరాలేదు. కత్తితో శిరచ్ఛేదనం చేసి సౌదీ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారని తెలుస్తోంది. రాజ కుటుంబసభ్యుడికి మరణశిక్ష అమలుచేయడం సౌదీ అరేబియాలోనే ఓ అరుదైన ఘటనగా నిల్చింది. ఇలాంటి ఓ ప్రముఖ కేసులలో ఫైసల్ బిన్ ముసైద్ అల్ సౌద్ కూడా తన అంకుల్ కింగ్ ఫైసల్ను 1975లో హత్య చేసిన ఘటన ఒకటి. కాగ, ఈ ఏడాదిలో ఇప్పటికే ఆ దేశంలో మరణశిక్షకు గురైనా వారి సంఖ్య వందల్లో ఉన్నట్టు సౌదీ అరేబియా చెబుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement