ఆలుమగల మధ్య సిగరెట్ చిచ్చు! | Saudi divorces his wife because he found a cigarette in her handbag | Sakshi
Sakshi News home page

ఆలుమగల మధ్య సిగరెట్ చిచ్చు!

Published Tue, Nov 26 2013 9:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

ఆలుమగల మధ్య సిగరెట్ చిచ్చు!

ఆలుమగల మధ్య సిగరెట్ చిచ్చు!

ఆయువును హరించే సిగరెట్ ఆలుమగల మధ్య కలతలు రేపుతోంది. మనిషిని మృతువుకు చేరువ చేసే సిగరెట్ పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. సౌదీ అరేబియాలో ఓ జంటను సిగరెట్ విడదీసింది. తన భార్య బ్యాగులో సిగరెట్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. దక్షిణ సౌదీ నగరం జిజాన్కు చెందిన ఓ వ్యక్తి పెళ్లైన మూడు నెలలకే భార్య నుంచి విడాకులు కోరారు. తన భార్య బ్యాగులో సిగరెట్ కనుగొన్న వెంటనే అతడు విడాకులకు వెళ్లాడు.

ఆ సిగరెట్కు తనకు సంబంధం లేదని, తానకు సిగరెట్ కాల్చే అలవాటు లేదని నచ్చజెప్పినా సదరు భర్త వినిపించుకోలేదు. ఇరువర్గాల బంధువులు అతడికి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు భార్యతో తెగతెంపులు చేసుకున్నాడు. సౌదీ అరేబియాలో దాదాపు 6 లక్షల మంది సిగరెట్లు తాగుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పొగతాగున్న వారిలో ఇది పదోవంతు. మొత్తం 60 లక్షల మంది పొగతాగుతున్నట్టు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement