‘స్కూటీనే కాదు పెట్రోలూ ఫ్రీ’ | scooty with petrol free for girl students in bihar | Sakshi
Sakshi News home page

‘స్కూటీనే కాదు పెట్రోలూ ఫ్రీ’

Published Sun, Oct 4 2015 12:21 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

‘స్కూటీనే కాదు పెట్రోలూ ఫ్రీ’ - Sakshi

‘స్కూటీనే కాదు పెట్రోలూ ఫ్రీ’

పట్నా: బిహార్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీ మరో ప్రజాకర్షక హామీని ప్రకటించింది. పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5,000 మంది విద్యార్థినులకు స్కూటీలను ఇస్తామని ప్రకటించిన ఆ పార్టీ.. తాజాగా వాటికి రెండేళ్ల పాటు పెట్రోలును కూడా ఉచితంగా ఇస్తామని తెలిపింది.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ మోదీ వెల్లడించారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తే అవి నడవడానికి పెట్రోలు ఎవరిస్తారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ విమర్శించిన నేపథ్యంలో సుశీల్‌మోదీ ఈ వాగ్దానాన్ని ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement