ఆర్బీఐ పాలసీ: మార్కెట్లు పతనం
ముంబై : కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష ప్రకటించిన అనంతరం పెట్టుబడిదారులు ప్రాఫిట్స్ బుకింగ్స్పై ఎక్కువగా మొగ్గుచూపారు. దీంతో మూడు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్ పడి దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టాల్లో 28,019.26 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 54.95 పాయింట్ల నష్టంతో 8,656గా నమోదవుతోంది. ఎక్కడ రేట్లు అక్కడే ఉంచుతున్నట్టు నేటి పాలసీ వెలువడిన అనంతరం వడ్డీరేట్ల సెన్సిటివ్ స్టాక్స్ మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ 2 శాతం మేర పడిపోయింది. యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహింద్రా క్షీణించింది. ఎస్బీఐ,ఐసీఐసీ బ్యాంకులు లాభాల్లో పయనిస్తున్నాయి. ఆటో స్టాక్స్ ఐషెర్ మోటార్స్, హీరో మోటార్, మారుతీ సుజుకీ, మహింద్రా అండ్ మహింద్రా టాప్ ఇండెక్స్ లూజర్లుగా నష్టాలను గడిస్తున్నాయి. అటు రియాల్టీ స్టాక్స్ కూడా మిక్స్డ్గానే ట్రేడ్ అవుతున్నాయి. రాజన్ వెళుతూ వెళుతూ రేట్లను కోసేసి పారిశ్రామిక, బ్యాంకింగ్, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తారా..? అని కొంతమంది విశ్లేషకులు భావించారు. కానీ ఎలాంటి సర్ ప్రైజ్లు లేకుండానే రాజన్ పాలసీ వెలువడింది. దీంతో దేశీయ సూచీలు నష్టాల్లో నమోదవుతున్నాయి.
అటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయం మారకం విలువలో కొంత మేర మార్పు జరిగింది. రూపాయి 0.12 పైసలు బలహీనపడి 66.96గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర రూ.68 పాయింట్లు పడిపోయ 31,108 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.