ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అనంతరం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరింత క్షీణించిన సెన్సెక్స్ 72 నిఫ్టీ 13 పాయింట్లకు పైగా నష్టపోయింది. భారీ ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 5 పాయింట్ల నష్టంతో26,226 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 8093 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిప్టీ మరోసారి 8100 దిగువకు చేరింది. ఇటలీ ప్రధాని మాటియో రెంజీ రాజీనామా యూరో పతనం మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. దాదాపు అన్ని సెక్టార్లు రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ,బ్యాంకింగ్ సెక్టార్ లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్ళ ధోరణి కనిపిస్తోంది.
అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఐష్, టాటా, బోష్ మోటార్ షేర్లు, లుపిన్, ఎంఅండ్ ఎం, మారుతి సుజుకీ లాభాల్లో ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ, రెడ్డీ లాబ్స్, గ్రాసిం, యాక్సిస్, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎల్ అండ్టీ, గెయిల్ ప్రధానంగా నష్టపోతున్నాయి.
అటు యూరో భారీ పతనాన్ని నమోదు చేసింది. దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ తోపోలిస్తే 0.07పైసల లాభంతో రూ.68.15 ఉంది.
Sensex , Nifty, Below 8,100, సెన్సెక్స్, నిఫ్టీ, ఒడిదుడుకులు,
లాభనష్టాలమధ్య స్టాక్మార్కెట్లు
Published Mon, Dec 5 2016 10:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
Advertisement
Advertisement