Below 8
-
లాభనష్టాలమధ్య స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అనంతరం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరింత క్షీణించిన సెన్సెక్స్ 72 నిఫ్టీ 13 పాయింట్లకు పైగా నష్టపోయింది. భారీ ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 5 పాయింట్ల నష్టంతో26,226 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 8093 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిప్టీ మరోసారి 8100 దిగువకు చేరింది. ఇటలీ ప్రధాని మాటియో రెంజీ రాజీనామా యూరో పతనం మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. దాదాపు అన్ని సెక్టార్లు రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ,బ్యాంకింగ్ సెక్టార్ లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్ళ ధోరణి కనిపిస్తోంది. అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఐష్, టాటా, బోష్ మోటార్ షేర్లు, లుపిన్, ఎంఅండ్ ఎం, మారుతి సుజుకీ లాభాల్లో ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ, రెడ్డీ లాబ్స్, గ్రాసిం, యాక్సిస్, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎల్ అండ్‌టీ, గెయిల్ ప్రధానంగా నష్టపోతున్నాయి. అటు యూరో భారీ పతనాన్ని నమోదు చేసింది. దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ తోపోలిస్తే 0.07పైసల లాభంతో రూ.68.15 ఉంది. Sensex , Nifty, Below 8,100, సెన్సెక్స్, నిఫ్టీ, ఒడిదుడుకులు, -
అమ్మకాల ఒత్తిడి, 8,100 కిందికి నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు , చమురు ధరల పతనం, ప్రభుత్వ డిమానిటేజేషన్ పై పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో లాభనష్టాల మధ్య మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురి అయ్యాయి. ఒక దశలో 138 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 71 పాయింట్ల నష్టంతో 26,240 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 8079 వద్ద ముగిశాయి. మరోవైపు వరుసగా నాలుగవ సెషన్లో కూడా అమ్మకాలు జోరు కొనసాగడంతో నిఫ్టీ 8100 స్థాయికి కిందికి పడిపోయింది. దీంతోపాటు అయిదునెలల కనిష్టానికి దిగజారింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లోని నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసింది. మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతూ చివరికి నష్టాలనే నమోదు చేశాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు లాభపడగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ , పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ షేర్లలో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. ప్రారంభంనుంచీ మీడియా , ఐటీ రంగం నష్టాల్లోనే కొనసాగింది. కోల్ ఇండియా అంబుజా, భారతీ, ఏసీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఐషర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోగా టాటా మోటార్స్, హిందాల్కో, బీవోబీ, సిప్లా, గెయిల్, లుపిన్, యాక్సిస్, సన్ ఫార్మా లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే 13 పైసలు నష్టపోయి 67.82 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 53 నష్టంతో రూ.29,330 వద్ద ఉంది. -
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో
ముంబై: ఆద్యంతం ఓలటైల్ గా సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి వరుసగా నాలుగవ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. అలాగే భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడి తో నిఫ్టీ నాలుగు నెలల కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 97 పాయింట్లు క్షీణించి 27,430 వద్ద నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 8,485 వద్ద క్లోజ్ అయ్యాయి. కీలక మద్దతుస్థాయిలను కోల్పోతున్న నిఫ్టీ సుమారు నాలుగు నెలల తరువాత మొదటిసారి 8,500 దిగువన ముగిసింది. చివరికి ఆరంభ నష్టాలనుంచి మిడ్ సెషన్లో కోలుకున్నప్పటికీ చివరి అర్థగంటలో పెరిగిన అమ్మకాలతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అన్ని సెక్టార్లూ నష్టాల్లో ఉండగా, ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభపడింది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ, మెటల్స్, ఐటీ రంగాలు నెగిటివ్ గా ముగిశాయి. గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, విప్రో, బీపీసీఎల్, అరబిందో, టాటా స్టీల్, స్టేట్‌బ్యాంక్, బీవోబీ, ఎన్టీపీసీ నష్టపోగా, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్ గాఅహిందాల్కో 4 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది. ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, ఏసీసీ, హీరోమోటో, భెల్, గెయిల్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, హెచడీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి ఒక పైసా నష్టంతో 66.71వద్ద ఉంది. అయితే బంగారం ధరలుమాత్రం వెలవలబోయాయి. ఇటీవలి లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఎంసీఎక్స్ మార్కెట్ లో 312 రూపాయల నష్టంతో పది గ్రా.పుత్తడి రూ. 30,354వద్ద ఉంది. -
లాభనష్టాల ఊగిసలాటలో మార్కెట్లు
ముంబై : నష్టాల్లో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్‌మార్కెట్లు, ప్రస్తుతం లాభనష్టాలకు మధ్య ఊగిసలాటలో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 11.70 పాయింట్ల స్వల్ప లాభంతో 28,076 వద్ద, నిఫ్టీ 3.45 పాయింట్ల నష్టంతో 8,639 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని ఐటీ, హెల్త్ కేర్ స్టాక్స్‌లో నెలకొన్న బలహీనత కారణంగా మార్కెట్లు నష్టాల్లో ఎంట్రీ ఇచ్చాయి. నేడు రాత్రి విడుదల కానున్న ఫెడ్ జూలై పాలసీ మీటింగ్‌పై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. తాజాగా విడుదలైన మెరుగైన జాబ్స్ డేటా అనంతరం ఫెడ్ రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లపై ఏవిధమైన సంకేతాలు ఇవ్వనుందోనని ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఒడిదుడుకుల్లో నడుస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హీరో మోటాకార్పొ, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ లాభాలు పండిస్తుండగా.. టీసీఎస్, సన్ ఫార్మా, లుపిన్, సిప్లా, ఎస్బీఐ నష్టాలను గడిస్తున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నేడు కూడా నష్టాల్లోనే పయనిస్తూ.. నిఫ్టీలో టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. ఇన్ఫీ స్టాక్ 1.27 శాతం పడిపోయింది. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 66.76గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 241 రూపాయల లాభంతో రూ.31,460గా కొనసాగుతోంది.