కూతురు ఫొటో తొలగించమంటున్న హీరో
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ముద్దుల తనయ సుహాన బికినీతో ఉన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం దుమారం రేపింది. సుహాన తన చిట్టి తమ్ముడు అబ్రామ్తో కలసి ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనపై షారుక్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో షారుక్ మాట్లాడుతూ.. సుహాన వయసు 16 ఏళ్లు అని, బీచ్లో తన తమ్ముడితో కలసి ఆడుకుంటున్నప్పటి ఫొటోపై వివాదం చేయడం సరికాదన్నాడు. సోషల్ మీడియాలో నుంచి ఈ ఫొటోను తొలగించాలని కోరాడు.
షారుక్ కుమార్తె బికినీలో తన బాడీని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యలు చేయడం కుసంస్కారమని అన్నాడు. సుహాన ఇంకా చిన్నపిల్ల అని, ఆమె బికినీ ఫొటోలను పోస్ట్ చేయడం దారుణమని చెప్పాడు. సుహానె ఫొటో వైరల్ కావడానికి తన స్టార్ డమ్ కారణమని, ఆమె తన కూతురు కాకపోయింటే వార్త అయ్యేదికాదని షారుక్ అన్నాడు.