
సింగపూర్ ‘ ఏ స్టార్’తో తెలంగాణ ఒప్పందం
ఆవిష్కరణ, పరిశోధన, ఇంక్యుబేషన్, వాణిజ్య రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సింగపూర్‌కు చెందిన ‘ఏ స్టార్’ (ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్) కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది.
హైదరాబాద్: ఆవిష్కరణ, పరిశోధన, ఇంక్యుబేషన్, వాణిజ్య రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సింగపూర్‌కు చెందిన ‘ఏ స్టార్’ (ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్) కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రిచ్ (రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది.
సింగపూర్ పర్యటనలో భాగంగా తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు బుధవారం 18 కంపెనీలకు చెందిన సీఈఓలతో భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, విద్య రంగాల నడుమ వారధిగా పనిచేస్తున్న ఏ స్టార్‌తో ఒప్పందం ద్వారా.. పరిశోధన, ఆవిష్కరణ, ఇంక్యుబేషన్, వాణిజ్య రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు మార్గం సుగమంకానుందని తెలిపారు.